Hafeez Saeed: టెర్రరిస్ట్ కుమారుడిపై కఠిన చర్యలు.. ఆ జాబితాలో చేర్చిన హోం శాఖ

2008 నవంబర్ లో ముంబయిలో జరిగిన ఉగ్ర పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్‌ హషీజ్‌ సయీద్‌(Hafeez saeed) కుమారుడిపై కేంద్రం చర్యలు తీసుకుంది. తల్హా సయీద్‌ను పేరును మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ....

Hafeez Saeed: టెర్రరిస్ట్ కుమారుడిపై కఠిన చర్యలు.. ఆ జాబితాలో చేర్చిన హోం శాఖ
Hafeez Saeed
Follow us

|

Updated on: Apr 10, 2022 | 7:12 PM

2008 నవంబర్ లో ముంబయిలో జరిగిన ఉగ్ర పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్‌ హషీజ్‌ సయీద్‌(Hafeez saeed) కుమారుడిపై కేంద్రం చర్యలు తీసుకుంది. తల్హా సయీద్‌ను పేరును మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా ఉండే తల్హా సయీద్‌ పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, 1967 కింద అతడిని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని భారత(India) హోం శాఖ తెలిపింది. 46 ఏళ్ల తల్హా సయీద్‌ పాకిస్థాన్‌లోని లాహోర్‌(Lahore) లో జన్మించాడు. తండ్రి స్థాపించిన లష్కరే తోయిబా ముఠాలో సీనియర్ నాయకుడైన తల్హా.. ఈ సంస్థ క్లెరిక్‌ విభాగానికి పెద్దగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న రెండు కేసుల్లో హఫీజ్‌ సయీద్‌కు 33 ఏళ్ల జైలు శిక్ష పడిన మరుసటి రోజే తల్హాను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ భారత్‌ నిర్ణయం తీసుకోవడం విశేషం.

2008 లో ముంబయిలో జరిగిన పేలుళ్ల సూత్రధారి, జమాత్ -ఉద్‌-దవా చీఫ్ హఫీజ్‌ సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పునిచ్చింది. ఉగ్రవాదులకు నిధుల మళ్లింపునకు సంబంధించిన రెండు కేసుల్లో ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా హఫీజ్ ఆస్తులను స్తంభింపజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో హఫీజ్‌ సయీద్‌ నిర్మించిన మసీదు, మదర్సాను స్వాధీనం చేసుకునేందుకు పాక్‌ అధికారులు సమాయత్తమయ్యారు.

Also Read

RRR: మరీ ఇంత దారుణమా !! RRRను టార్గెట్‌ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్

Pakistan: విదేశీ డబ్బులకు ప్రతిపక్షాలు అమ్ముడు పోయాయి.. సంచలన ప్రకటన చేసిన పాక్ మాజీ ప్రధాని..

ఒంపుసొంపుల వయ్యారి.. కైపెక్కిస్తోన్న నోరా ఫతేహి