ఇక రోబోలతో వ్యవసాయం: ఐరన్‌ ఆక్స్‌

”మూన్‌షాట్‌” లేబొరేటరీ రోబోటిక్స్‌ విభాగంలో ఇంజనీరుగా అలెగ్జాండర్‌ పనిచేశాడు. అక్కడ అతని బాధ్యత డ్రోన్ల రూపకల్పన. అక్కడే పని చేస్తున్న జోన్‌ బిన్నీతో అతడికి స్నేహం కుదిరింది. వారిద్దరూ ఎంతో కృషి చేసి ఐరన్‌ ఆక్స్‌ సంస్థకు ఊపిరిపోశారు. ఈ సంస్థకు అలెగ్జాండర్‌ సీఈవో, బిన్నీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌. కేవలం 33 ఏళ్ల వయసులోనే వీరిద్దరూ కలిసి రోబోలతో వ్యవసాయం కోసం దాదాపు 60 లక్షల డాలర్ల మేర నిధులు సేకరించారు. తర్వాత అంకుర సంస్థను […]

ఇక రోబోలతో వ్యవసాయం: ఐరన్‌ ఆక్స్‌
Follow us

| Edited By:

Updated on: May 06, 2019 | 4:58 PM

”మూన్‌షాట్‌” లేబొరేటరీ రోబోటిక్స్‌ విభాగంలో ఇంజనీరుగా అలెగ్జాండర్‌ పనిచేశాడు. అక్కడ అతని బాధ్యత డ్రోన్ల రూపకల్పన. అక్కడే పని చేస్తున్న జోన్‌ బిన్నీతో అతడికి స్నేహం కుదిరింది. వారిద్దరూ ఎంతో కృషి చేసి ఐరన్‌ ఆక్స్‌ సంస్థకు ఊపిరిపోశారు. ఈ సంస్థకు అలెగ్జాండర్‌ సీఈవో, బిన్నీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌. కేవలం 33 ఏళ్ల వయసులోనే వీరిద్దరూ కలిసి రోబోలతో వ్యవసాయం కోసం దాదాపు 60 లక్షల డాలర్ల మేర నిధులు సేకరించారు. తర్వాత అంకుర సంస్థను ఏర్పాటు చేసి రెండేళ్ల పాటు తీవ్రంగా శ్రమించారు. చివరకు ”మూన్‌షాట్‌” లేబొరేటరీ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నారు. ”ఇప్పుడు మా రోబోలు సాగుచేసిన కూరగాయలు సరఫరాకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కూరగాయలతో చేసిన సలాడ్‌ మీరెన్నడూ ఎరుగనంత రుచిగా ఉంటుంది” అని ఊరిస్తున్నాడు అలెగ్జాండర్‌.

కాలిఫోర్నియాలోని శాన్‌ కార్లోస్‌ పట్టణ శివారులో ”ఐరన్‌ ఆక్స్‌” కంపెనీ 8 వేల చదరపు అడుగుల ప్రాంగణంలో రోబో వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్ది పంటల సాగు చేపట్టారు. ఈ కూరగాయల అమ్మకానికి శాన్‌ ఫ్రాన్సిస్కో తీరప్రాంత రెస్టారెంట్లతో అలెగ్జాండర్‌ సంప్రదింపులు సాగిస్తున్నాడు. అలెగ్జాండర్‌ మాట్లాడుతూ ‘వచ్చే ఏడాదికల్లా మా రోబో పండించిన కూరగాయలు సూపర్‌ మార్కెట్లకు చేరతాయి. నీటి అవసరం ఎక్కువగా లేకుండా సహజ సూర్యకాంతిపై ఆధారపడే గ్రీన్‌ హౌజ్‌లలో వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. అత్యంత ఖర్చుతో కూడుకున్న హైపవర్‌ విద్యుద్దీప కాంతి ఆధారిత ఇన్‌డోర్‌ సాగుకన్నా ఇది ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ప్రారంభంలో కాస్త నష్టమొచ్చినా తమ దిగుబడిని మార్కెట్‌ ధరకన్నా తక్కువకే విక్రయిస్తూ పోటీలో నెగ్గుకొస్తాం. అలాగే ఐదేండ్లలో అమెరికాలోని అన్ని మెట్రో ప్రాంతాల్లో ఐరన్‌ ఆక్స్‌ రోబో వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు చేయడమే మా లక్ష్యం’ అంటున్నాడు. వ్యవసాయ రంగంలో పనికి అమెరికా కార్మిక శక్తి పెద్దగా మొగ్గు చూపడంలేదు. అందుకే రోబోలతో సాగు, అందునా మట్టిరహిత (హైడ్రోపోనిక్‌) పద్ధతిలో వ్యవసాయమే మెరుగని అలెగ్జాండర్‌పేర్కొన్నాడు.