ఈయూ నుంచి ఇంగ్లాండ్ అవుట్

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రజలు కోరుకున్న క్షణాలు రానే వచ్చాయి.. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చేసింది. జనవరి 31 రాత్రి 11 గంటలకు బ్రెగ్జిట్‌ సంపూర్ణమైంది. దేశ రాజధాని లండన్‌లో గుమిగూడిన వేలాది మంది ప్రజలు ఈ మహత్తర కౌంట్‌డౌన్‌ ఈవెంట్‌లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.. ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకు రావడం నవశకానికి నాందిగా అభివర్ణించారు ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌.. బ్రెగ్జిట్‌ పూర్తయిన నేపథ్యంతో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. […]

ఈయూ నుంచి ఇంగ్లాండ్ అవుట్
Follow us

|

Updated on: Feb 01, 2020 | 3:24 PM

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రజలు కోరుకున్న క్షణాలు రానే వచ్చాయి.. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చేసింది. జనవరి 31 రాత్రి 11 గంటలకు బ్రెగ్జిట్‌ సంపూర్ణమైంది. దేశ రాజధాని లండన్‌లో గుమిగూడిన వేలాది మంది ప్రజలు ఈ మహత్తర కౌంట్‌డౌన్‌ ఈవెంట్‌లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు..

ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకు రావడం నవశకానికి నాందిగా అభివర్ణించారు ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌.. బ్రెగ్జిట్‌ పూర్తయిన నేపథ్యంతో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రెగ్జిట్ నిర్ణయం వల్ల కొన్ని అవరోధాలు ఎదురైనా, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు జాన్సన్‌.. ఈయూతో తమ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు..

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు రావడాన్ని మెజారిటీ దేశ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పురోభివృద్దికి ఈ చర్య ఎంతో దోహదపడుతుందని వారంటున్నారు..మరోవైపు యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని స్కాట్‌లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌లతో ప్రో-యూరోపియన్‌ యూనియన్‌ బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇది విషాదకరమైన ఘట్టమని వారు అభివర్ణించారు..

ఆక్స్‌ఫర్డ్‌ యూనిర్సిటీ విద్యార్థులు కూడా బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఈయూ నుంచి బయటకు రావడంవల్ల బ్రిటన్‌ ఎంతో నష్టపోతుందని వారంటున్నారు..ఇక యూరోపియన్‌ యూనియన్‌లోని పలు దేశాల ప్రజలకు బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ అసలు ఇష్టం లేదు.. ఫ్రాన్స్‌ నుంచి బ్రిటన్‌కు బయలు దేరిన నౌకలో సందడి తగ్గింది. ఇకపై బ్రిటన్‌కు స్వేచ్చగా వెళ్లలేమని ఇందులోని ప్రయాణీకులు అంటున్నారు..

మరోవైపు బ్రిటన్‌ వైదొగిన నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌లో ఆ దేశ ప్రతినిధుల సభ్యత్యం ముగిసింది. బెల్జియం రాజధాని బ్రసెల్‌లో ఉన్న ఈయూ పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉన్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌ జాతీయ పతాకాన్ని తొలగించారు.. ఆ భవనం ఆవరణలోనే ఉన్న బ్రిటన్‌ నేమ్‌ ప్లేట్‌ను కూడా తీసేశారు..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..