పెరుగుతోన్న ఊబకాయం.. ‘బై వన్ గెట్‌ వన్’‌కి బ్రేక్‌

సూర్యుడు అస్తమించిన దేశం బ్రిటన్‌లో ఊబకాయం పెరిగిపోతోంది. దీంతో ఆ దేశ ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆహార పదార్ధాల్లో బై వన్‌ గెట్ వన్ అనే ఆఫర్లకు బ్రేక్ వేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు.

పెరుగుతోన్న ఊబకాయం.. 'బై వన్ గెట్‌ వన్'‌కి బ్రేక్‌
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 12:19 PM

సూర్యుడు అస్తమించిన దేశం బ్రిటన్‌లో ఊబకాయం పెరిగిపోతోంది. దీంతో ఆ దేశ ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తినే వస్తువుల్లో(పిజ్జా, బిరియాని, స్నాక్స్‌ వంటి పదార్థాలు) బై వన్‌ గెట్ వన్ అనే ఆఫర్లకు బ్రేక్ వేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. అంతేకాదు ఇకపై ప్రతి ఆహారం వలన ఎంత కేలరీలు శరీరానికి అందుతాయో.. ఆ వివరాలను కూడా రెస్టారెంట్‌ మెనూలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని బోరిస్ అధికారులను ఆదేశించారు.

అయితే ఇలాంటి ఆలోచనలు చేయడం అక్కడి ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలోనూ బ్రిటన్ ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు చేసింది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లో కూర్చొని తినే వారి సంఖ్య పెరిగింది. దాంతో ఊబకాయం కూడా పెరిగింది. అక్కడి ఆసుపత్రుల్లో కరోనా సోకి ఐసీయూకు వచ్చే వారిలో 8 శాతం మంది ఊబకాయంతో బాధపడేవారే ఉన్నట్లు సమాచారం. దీంతో దేశంలో ఊబకాయం తగ్గించేందుకు బోరిస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక బరువు తగ్గడం కష్టమే అయినా చిన్న చిన్న మార్పులతో ఫిట్‌గా ఉండొచ్చని ఆ దేశ ప్రధాని జాన్సన్ చెబుతున్నారు.

Read This Story Also: సుశాంత్‌ ఆత్మహత్య కేసు: మహేష్‌ భట్ పోలీసులకు ఏం చెప్పారంటే