ఫ్రిజ్ లో ‘ దాక్కున్న’ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ఎన్నికల ప్రచారం చివరి రోజున జర్నలిస్టుల ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు ఓ ఫ్రిజ్ లో ‘ దాక్కుని ‘ సంచలనం సృష్టించారు. ఆయనగారి ఈ ‘ వింత చేష్ట ‘ టీవీలో లైవ్ కావడం విశేషం. బోరిస్ వెస్ట్ యార్క్ షైర్ చేరుకున్నప్పుడు ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు జీఎంబీ ప్రెజంటర్ పయర్స్ మోర్గాన్, ఆయన కొల్లీగ్ సుసానా రీడ్ అక్కడికి వచ్చారు. మోర్గాన్ ఆయనను ఏదో అడగబోతుండగా ‘ జస్ట్.. […]

ఫ్రిజ్ లో ' దాక్కున్న' బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Follow us

|

Updated on: Dec 11, 2019 | 8:00 PM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ఎన్నికల ప్రచారం చివరి రోజున జర్నలిస్టుల ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు ఓ ఫ్రిజ్ లో ‘ దాక్కుని ‘ సంచలనం సృష్టించారు. ఆయనగారి ఈ ‘ వింత చేష్ట ‘ టీవీలో లైవ్ కావడం విశేషం. బోరిస్ వెస్ట్ యార్క్ షైర్ చేరుకున్నప్పుడు ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు జీఎంబీ ప్రెజంటర్ పయర్స్ మోర్గాన్, ఆయన కొల్లీగ్ సుసానా రీడ్ అక్కడికి వచ్చారు. మోర్గాన్ ఆయనను ఏదో అడగబోతుండగా ‘ జస్ట్.. వన్ సెకండ్ ‘.. అంటూ బోరిస్.. చటుక్కున పాలసీసాలను భద్రపరిచే భారీ ఫ్రిజ్ లోకి వెళ్లి ‘ దాక్కున్నారు ‘. పైగా ఆయన ప్రెస్ సెక్రటరీ రాబర్ట్ ఆక్స్ లే.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. మోర్గాన్ ను అడ్డుకున్నాడు. దీంతో మోర్గాన్, ఆయన కొల్లీగ్ సుసానా షాక్ తిన్నారు. ఆ తరువాత రాబర్ట్ చర్యపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు-గురువారం బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టోరీలదే ఆధిక్యమని, హంగ్ పార్లమెంట్ ఏర్పడవచ్ఛునని వార్తలు వస్తున్నాయి. తనకు బోరిస్ జాన్సన్ తో ఏళ్ళ తరబడి పరిచయం, స్నేహం ఉన్నాయని, అయితే ఆయన ఈ రోజు ఎందుకిలా చేశాడో తెలియడంలేదని మోర్గాన్ వ్యాఖ్యానించారు.