Congo Boat Capsize: కాంగోలో పడవ మునిగి 50 మంది మృతి..మరో 60 మంది గల్లంతు!

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పడవ మునిగిపోవడంతో 50 మందికి పైగా మరణించారు. 60 మంది గల్లంతయ్యారు. కాంగో నదిలో ఈ ప్రమాదం జరిగింది.

Congo Boat Capsize: కాంగోలో పడవ మునిగి 50 మంది మృతి..మరో 60 మంది గల్లంతు!
Congo Boat Capsize (file Photo)
Follow us

|

Updated on: Oct 10, 2021 | 9:17 AM

Congo Boat Capsize: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పడవ మునిగిపోవడంతో 50 మందికి పైగా మరణించారు. 60 మంది గల్లంతయ్యారు. కాంగో నదిలో ఈ ప్రమాదం జరిగింది. వాయువ్య ప్రావిన్స్ మొంగాలా గవర్నర్ అధికార ప్రతినిధి నెస్టర్ మగ్బాడో, 51 మృతదేహాలను వెలికితీసినట్లు, ఇంకా 60 కి పైగా ఆచూకీ లభించలేదని చెప్పారు. ఈ ప్రమాదంలో 39 మంది సురక్షితంగా బయటపడ్డారు. పడవ ఎక్కే ముందు ప్రయాణికులను లెక్కించలేదని ప్రతినిధి చెప్పారు. అటువంటి పరిస్థితిలో, పడవ సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి తప్పిపోయిన వారి సంఖ్యను అంచనా వేస్తున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని సజీవంగా రక్షించవచ్చని ఆశిస్తున్నట్టు అయన చెప్పారు.

ఎక్కువ మంది ప్రయాణికుల కారణంగా ప్రమాదం..

రాత్రి సమయంలో వాతావరణం బాగోకపోవడంతో ప్రమాదం జరిగిఉండవచ్చని.. దానికి తోడు పడవలో ఎక్కువ మంది ప్రయాణీకులు ఉండడం కూడా ఒక కారణం కావచ్చనీ భావిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల కచ్చితమైన సంఖ్య తెలియాలంటే కొంతసమయం పట్టొచ్చు. ప్రావిన్షియల్ అధికారులు మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు.

కాంగోలో తరచుగా జరిగే పడవ ప్రమాదాలు

కాంగోలో పడవ ప్రమాదాలు సర్వసాధారణం, ఎందుకంటే ఇక్కడ పడవలు తరచుగా ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకువెళతాయి. అలాగే, ప్రయాణించేటప్పుడు చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించరు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, మై-ఎన్‌డొంబే ప్రావిన్స్‌లోని కాంగో నదిలో పడవ బోల్తాపడింది. ఇందులో 60 మంది మరణించారు. పడవలో 700 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను అతిగా ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.

2010 లో పడవ బోల్తాపడి 135 మంది మరణించారు. జనవరి 2021 లో, కివు సరస్సులో ప్రయాణికుల పడవ మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. అదే సమయంలో, మే 2020 లో, కివు సరస్సులో పడవ బోల్తాపడి 8 ఏళ్ల బాలికతో సహా 10 మంది మరణించారు. 2010 జూలైలో, పశ్చిమ ప్రావిన్స్ బందుండులో పడవ బోల్తా పడడంతో 135 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Railway: ఆ రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్‌ చాలా ఖరీదు..! ఎందుకో తెలుసా..?

Hugging: కౌగిలించుకోవ‌డం వ‌ల్ల ఈ 4 ఆరోగ్య ప్రయోజ‌నాలు..! మీకు తెలియ‌కుండానే జ‌రిగిపోతాయి..