బంగ్లాదేశ్ విమానం హైజాక్ యత్నించిన దుండగుడి కాల్చివేత

దుబాయ్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కాల్చి చంపారు. ఢాకా నుంచి దుబాయి బయల్డేరిన బిపూన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బీజే 147.. కొద్ది సేపటికే చిట్టగాంగ్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం బయల్డేరిన సమయంలో ఓ వ్యక్తి దగ్గర గన్ ఉండడాన్ని గమనించిన ప్యాసింజర్ విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పైలట్లు చిట్టగాంగ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దించేశారు. విమానాన్ని ఆ వ్యక్తి హైజాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు […]

బంగ్లాదేశ్ విమానం హైజాక్ యత్నించిన దుండగుడి కాల్చివేత
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:38 PM

దుబాయ్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కాల్చి చంపారు. ఢాకా నుంచి దుబాయి బయల్డేరిన బిపూన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బీజే 147.. కొద్ది సేపటికే చిట్టగాంగ్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం బయల్డేరిన సమయంలో ఓ వ్యక్తి దగ్గర గన్ ఉండడాన్ని గమనించిన ప్యాసింజర్ విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పైలట్లు చిట్టగాంగ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దించేశారు. విమానాన్ని ఆ వ్యక్తి హైజాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. చిట్టగ్యాంగ్ లో ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను దించేశారు కమాండోలు. తర్వాత హైజాకర్ కోసం వేటసాగించారు. దాదాపు మూడు గంటల ఆపరేషన్ తర్వాత దుండగుడిని కాల్చి చంపారు. అయితే దుండగుడు ఎవరు అనే దానిపై విచారణ చేపడుతున్నారు. దీంతో ఇండియన్ ఎయిర్ పోర్టు లో అలర్ట్ ప్రకటించింది.