Bill Gates: బిల్ గేట్స్ తన సంస్థలో మహిళా ఉద్యోగులను డేటింగ్ కు పిలిచారా..విడాకుల వ్యవహారానికి అదీ కారణమేనా?

Bill Gates: ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో షాకింగ్ విషయాలు ఒక్కొటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా బిల్ గేట్స్ వ్యవహారశైలిపై ఆరోపణలు వినవస్తున్నాయి.

Bill Gates: బిల్ గేట్స్ తన సంస్థలో మహిళా ఉద్యోగులను డేటింగ్ కు పిలిచారా..విడాకుల వ్యవహారానికి అదీ కారణమేనా?
Bill Gates
Follow us

|

Updated on: May 17, 2021 | 3:19 PM

Bill Gates: ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో షాకింగ్ విషయాలు ఒక్కొటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా బిల్ గేట్స్ వ్యవహారశైలిపై ఆరోపణలు వినవస్తున్నాయి. మెలిందాతో వివాహం అయిన తరువాత బిల్ గేట్స్ తన సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు అమ్మాయిలను డేట్ కు రమ్మని అడిగినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ ఫైనాన్స్ విభాగంలో ఉన్నత స్థాయిలో పనిచేసే ఒక ఉద్యోగి పై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారాన్నీ బిల్ గేట్స్ కప్పిపుచ్చారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ కారణాలే ఇప్పుడు బిల్ గేట్స్..మెలిందా గేట్స్ విడిపోవడానికి కారణాలుగా చెప్పుకుంటున్నారు. తన విడాకుల విషయంలో మాట్లాడుతూ మెలిండా తమ వివాహం ‘తిరిగి పొందలేని విధంగా విచ్ఛిన్నమైంది’ అని అందానికి ఇదే కారణం అని తెలుస్తోంది.

న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, 64 ఏళ్ల బిల్ గేట్స్ 2006 లో మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని బయటకు రమ్మని అడిగారు. “ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తే, అది ఎప్పుడూ జరగలేదని నటించండి” అని గేట్స్ ఆ మహిళా ఉద్యోగికి ఇమెయిల్ పంపారు. ఆ మహిళ గేట్స్ సలహాను అంగీకరించింది. ఆమె తనను ఎప్పుడూ బయటకు రమ్మని అడగలేదని నటించింది. తరువాత మరోసారి 2018 లో, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో పనిచేస్తున్న అమ్మాయిని గేట్స్ డేటింగ్ కోసం అడిగాడు. గేట్స్, ఆ మహిళ తమ కార్యాలయ పనిపై న్యూయార్క్‌లో ఉన్నారు. అప్పుడు అతను ఆమెతో ఇలా అన్నాడు: “నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, మీరు నాతో విందు చేస్తారా?” గేట్స్ విధానం తనకు అసౌకర్యాన్ని కలిగించిందని, కానీ, తాను నవ్వి ఊరుకున్నానని ఆ మహిళ న్యూయార్క్ టైమ్స్ కి తెలిపింది. అయితే, మెలిండాకు తన భర్త ఈ విధమైన ప్రవర్తన గురించి తెలుసనీ న్యూయార్క్ టైమ్స్ పేర్కొనలేదు.

మరోవైపు గేట్స్ తన ముఖ్య సహాయకులలో ఒకరైన మైఖేల్ లార్సన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను బిల్ గేట్స్ సరైన పద్ధతిలో నిర్వహించలేదని మెలిందా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్ గేట్స్, మెలిందా యాజమాన్యంలోని వెంచర్ క్యాపిటల్ సంస్థ ర్యాలీ క్యాపిటల్ యాజమాన్యంలోని సైకిల్ షాపులో లార్సన్ ఒక మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు 2017 లో ఒక అనామక వ్యక్తి బిల్, మెలిండాకు సమాచారం ఇచ్చాడు. తరువాత, లార్సన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆ మహిళ అంగీకరించి, 2018 లో బహిర్గతం కాని ఒప్పందంపై సంతకం చేసింది. ఇప్పుడు ఈ కారణాలన్నీ బిల్ గేట్స్ విడాకులకు దారితీసాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.

Also Read: ISRAEL-PALESTINE WAR: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. తగ్గేదే లేదంటున్న ఇజ్రాయిల్.. రంగంలోకి యుఎన్ఓ

ఇజ్రాయెల్ లో నిర్మాణంలో ఉన్న ప్రార్థనా మందిరం కూలి ఇద్దరి మృతి, 160 మందికి పైగా గాయాలు, ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!