cyber attack: అమెరికా సమగ్రతకు సైబర్ అటాక్‌తో ముప్పు…జో బైడెన్… జాగ్రత్త వహించాలని సలహా…

సైబర్ దాడులతో అమెరికా దేశ సమగ్రతకు భంగంవాటిల్లుతుందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ అన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా కంపెనీలు, ఫెడరల్ ఏజెన్సీల మీద దాడుల కారణంగా అమెరికాకు పెద్ద ముప్పు వాటిల్లబోతోందని అన్నారు.

cyber attack: అమెరికా సమగ్రతకు సైబర్ అటాక్‌తో ముప్పు...జో బైడెన్... జాగ్రత్త వహించాలని సలహా...
Follow us

| Edited By:

Updated on: Dec 23, 2020 | 8:21 AM

సైబర్ దాడులతో అమెరికా దేశ సమగ్రతకు భంగంవాటిల్లుతుందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ అన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా కంపెనీలు, ఫెడరల్ ఏజెన్సీల మీద దాడుల కారణంగా అమెరికాకు పెద్ద ముప్పు వాటిల్లబోతోందని అన్నారు. సైబర్ అటాక్స్ నేపథ్యంలో జాగ్రత్తగా, ఆచితూచి ఆలోచించాలని, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు.

పెద్ద ముప్పుగా మారుతాయి….

సైబర్ దాడుల కారణంగా అమెరికాకు పెద్ద ప్రమాదం ముందుందని అన్నారు. సైబర్ అటాకర్స్ వ్యవస్థలలోని లోపాలను కేంద్రంగా చేసుకుని దాడులకు దిగుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ…. దాడులను అరికట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. అమెరికా భద్రతా వ్యవస్థ బలపడాల్సి ఉందని, సైబర్ దాడిని తట్టుకునే వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.