అమెరికా మీడియాపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఆగ్రహం.. పక్షపాత ధోరణి తగదని హితవు..

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ అమెరికా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కథనాలు ప్రచురితం చేయడంలో..

అమెరికా మీడియాపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఆగ్రహం.. పక్షపాత ధోరణి తగదని హితవు..
S Jaishankar
Follow us

|

Updated on: Sep 26, 2022 | 2:16 PM

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ అమెరికా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కథనాలు ప్రచురితం చేయడంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తన వైఖరిని మార్చుకోవాలని అమెరికా మీడియాకు హితవు పలికారు. మీడియాలో రాజకీయాలు నడుస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కశ్మీర్ విషయం, 370 ఆర్టికల్ పై అగ్రరాజ్యంలో జరిగిన చర్చను ఈసందర్భంగా సుబ్రమణ్యం జైశంకర్ ప్రస్తావించారు. అమెరికాలో మీడియాను తాను గమనిస్తున్నానని, కొన్ని మీడియా సంస్థల కవరేజీలో పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొందరు తమను తాము సంరక్షకులుగా భావిస్తుంటారని, అలాంటి వారు భారత ప్రజల హృదయాలను గెలుచుకోలేరని ఈసందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ వ్యాఖ్యానించారు.

కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370పై వాషింగ్టన్ డిసి నుంచి ప్రచురితమయ్యే ద వాషింగ్టన్ పోస్టు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ స్పందించారు. ఏదైనా ఉగ్రవాద ఘటన జరిగితే హత్యకు గురైన వ్యక్తి ఏ మతానికి చెందిన వాడనేది ముఖ్యం కాదని, ఈఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్న సిబ్బంది, ప్రజల గురించి కాకుండా ఇంటర్నెట్ పై నియంత్రణ గురించి చర్చ జరగుతుందని, ప్రాణ నష్టం కంటే ఇంటర్నెట్ పై నియంత్రణ లేకపోవడమే ప్రమాదకరం అనే దశకు కొందరు చేరుకుంటే.. దానిపై తానేం మాట్లాడగలనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి.

370 ఆర్టికల్ పై వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా, వాస్తవాలను వక్రీకరించారని, ప్రజలు సత్యమేదో, అసత్యమేదో తెలియక అయోమయానికి గురవుతున్నారని, దీనికి కారణంగా మీడియానే అంటూ విమర్శలు గుప్పించారు. మీడియాలో రాజకీయాలు నడుస్తుంటాయని, ఇది మంచిది కాదని సుబ్రమణ్యం జై శంకర్ అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మన సందేశాన్ని బయటకు తెలియజేయాలని, ప్రజలను విద్యావంతుల్ని చేయాలని కేంద్ర విదేశాగం శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?