Barbados: బ్రిటిషు కబంధ హస్తాల నుంచి మరో దేశం విముక్తి.. సరికొత్త రిపబ్లిక్‌గా అవతరించిన బార్బడోస్

ఎట్టకేలకు తెల్లదొరల కబంధ హస్తాల నుంచి మరో దేశం విముక్తి పొందింది. బానిస సంకెళ్లు తెంచుకుంటూ బార్బడోస్ అధికారికంగా ప్రపంచంలోనే సరికొత్త రిపబ్లిక్‌గా అవతరించింది.

Barbados: బ్రిటిషు కబంధ హస్తాల నుంచి మరో దేశం విముక్తి.. సరికొత్త రిపబ్లిక్‌గా అవతరించిన బార్బడోస్
Barbados Becomes A Republic
Follow us

|

Updated on: Dec 01, 2021 | 8:29 AM

Barbados Republic: ఎట్టకేలకు తెల్లదొరల కబంధ హస్తాల నుంచి మరో దేశం విముక్తి పొందింది. బానిస సంకెళ్లు తెంచుకుంటూ బార్బడోస్ అధికారికంగా ప్రపంచంలోనే సరికొత్త రిపబ్లిక్‌గా అవతరించింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలు బ్రిటన్ పాలనలోనే కొనసాగిన విషయం తెలిసిందే. కాలక్రమంలో అనేక రాజ్యాలకు స్వతంత్రాన్ని ఇచ్చి వదిలేసినప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ బ్రిటన్ చేతిలోనే కొనసాగుతున్నాయి. బ్రిటన్ రాణే వాటిపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటూ వస్తున్నారు. కాగా, తాజాగా మరో చిన్న దేశం బ్రిటన్ నుంచి విముక్తి పొందింది. సుమారు 400 ఏళ్ల తర్వాత కరీబియన్ దీవుల్లో ఒకటైన బార్బడోస్ బ్రిటన్ రాణిని తమ దేశాధినేతగా వదిలేసి మొట్టమొదటి సారి తమ అధినేతను ఎన్నుకుంది.

రాజధాని బ్రిడ్జ్‌టౌన్‌లో రాత్రిపూట జరిగిన వేడుకలో డామ్ సాండ్రా మాసన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ 55వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్స్ ఆఫ్ వేల్స్, బార్బాడియన్ గాయని రిహన్న హాజరయ్యారు. అర్థరాత్రి బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్‌డౌన్‌లో వందలాది మంది ప్రజల కరతాల ధ్వనుల మధ్య బార్బడోస్‌కు గణతంత్రాన్ని ప్రకటించారు. అక్కడి క్రౌడ్ హీరోస్ స్క్వేర్ ప్రాంతంలో బార్బడోస్ జెండా స్వతంత్రగా ఎగురుతుంటే సదర్వంగా 21 తుపాకులు వందనంగా గాలిలో తూటాలతో శబ్దాలు చేశాయి.

కొత్త అధ్యక్షుడు ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్‌ను ప్రదానం చేయడానికి ముందు ఈ క్షణాన్ని అతను కొత్త ప్రారంభం అని అభివర్ణించాడు. “భవిష్యత్తులో సంతోషం, శాంతి శ్రేయస్సు” కోసం రాణి దేశానికి తన శుభాకాంక్షలు పంపారు. బార్బడోస్ దేశానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మసోన్ మాట్లాడుతూ ‘‘గణతంత్ర బార్బడోస్‌ ప్రజలుగా మన దేశానికి మనం గొప్ప స్ఫూర్తిని అందించాలి. రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్‌‌ను అందించాలి. ఈ దేశానికి మనమంతా వెన్నెముకలా నిలబడాలి. మనం బార్బడోస్ ప్రజలం’’ అని అన్నారు.

బార్బడోస్ కొత్త శకం అరంభమైంది. శతాబ్దాలుగా బ్రిటన్ ప్రభావానికి ముగింపు పలికింది. 400 సంవత్సరాలకు పైగా ద్వీపం అట్లాంటిక్ బానిస వాణిజ్యానికి కేంద్రంగా ఉంది. అధికార మార్పును సూచించడానికి, బ్రిటీష్ రాచరికానికి అంతిమ వందనం సమర్పించారు. రాయల్ స్టాండర్డ్ జెండాను కిందకు దించి బార్బడోస్ జాతీయ జెండాను సగర్వంగా ఎగురువేశారు ఆ దేశం కొత్త అధ్యక్షులు మసోన్. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ప్రిన్స్ చార్లెస్ రాజ్యాంగ హోదా మారినప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘాటించారు.

2018 నుండి ద్వీపం గవర్నర్ జనరల్ అయిన 72 ఏళ్ల డామే సాండ్రా మాసన్ గత నెలలో పార్లమెంటులో జరిగిన ఓటింగ్ తరువాత దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆమె ఇప్పుడు దేశాధినేతగా రాణి స్థానంలో కొనసాగుతున్నారు. “వెస్సెల్ రిపబ్లిక్ బార్బడోస్ తన తొలి ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, మన దేశాన్ని, పౌరులను సురక్షితంగా అభివృద్ధి పథంలో ఉంచాలి” అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె అన్నారు.

ఇదిలావుంటే, బార్బడోస్ గత సంవత్సరమే రిపబ్లిక్ రావల్సి ఉంది. అయితే అది బ్రిటిష్ కామన్వెల్త్‌లోనే కొనసాగుతుండటంతో ఇప్పటికీ బ్రిటన్ రాచరికపు పాలన నుంచి విముక్తి లభించింది. గతంలో బ్రిటిష్ కామన్వెల్త్ అని పిలిచేవారు. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది బ్రిటన్‌తో ఎటువంటి చారిత్రక సంబంధాలు లేని కొన్ని దేశాలతో పాటు బ్రిటిష్ పాలనలో కొనసాగుతున్న దేశాలు , ప్రస్తుత డిపెండెన్సీలకు అనుకూలంగా ఉండేందుకు ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంది.

Read Also…  83 Movie : భార‌తీయుల క‌ల‌ను వెండితెర‌పై సాక్షాత్క‌రింప చేయనున్న “83”.. తెలుగు ట్రైలర్

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??