ఆస్ట్రియా యువరాణి మరియా మృతి
ఆస్ట్రియా యువరాణి మరియా గాలిట్జీన్ (31) మృతిచెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో హ్యూస్టన్‌లో కన్నుమూశారు. అయితే మరియా మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 4న మరియా మృతి చెందినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. 2017లో హ్యూస్టన్‌లో భారత సంతతికి చెందిన చెఫ్ రిషి రూప్ సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. రిషి రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా పనిచేస్తున్న హ్యూస్టన్లోనే మరియా ఇంటిరీయర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 1988లో లగ్జంబర్గ్‌లో […]
ఆస్ట్రియా యువరాణి మరియా గాలిట్జీన్ (31) మృతిచెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో హ్యూస్టన్‌లో కన్నుమూశారు. అయితే మరియా మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 4న మరియా మృతి చెందినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. 2017లో హ్యూస్టన్‌లో భారత సంతతికి చెందిన చెఫ్ రిషి రూప్ సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. రిషి రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా పనిచేస్తున్న హ్యూస్టన్లోనే మరియా ఇంటిరీయర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
1988లో లగ్జంబర్గ్‌లో జన్మించిన ప్రిన్సెస్ మరియా.. అన్నా, ప్రిన్స్ పియోటర్ గాలిట్జీన్ కుమార్తె. మరియాకు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. ఆమెకు అయిదు సంవత్సరాల వయస్సులోనే రష్యాకు మకాం మార్చారు. అక్కడే గ్యాడ్యూయేషన్ పూర్తిచేసుకున్న మరియా ఆర్ట్ ఆండ్ డిజైన్ కాలేజీలో చేరేందుకు బెల్జియంకు వెళ్లారు. చిన్న వయస్సులోనే మరియా మరణించడంతో రాజ కుటంబీకులంతా సంతాపం ప్రకటించారు.