AstraZeneca: ఆ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి..యూకేలో కలకలం!

యూకేలో కరోనా వ్యాక్సిన్ కలకలం రేపుతోంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా తీసుకున్న వారిలో ఏడుగురు రక్తం గడ్డకట్టడంతో మరణించారు.

AstraZeneca: ఆ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి..యూకేలో కలకలం!
Astrazeneca
Follow us

|

Updated on: Apr 04, 2021 | 9:15 AM

AstraZeneca: యూకేలో కరోనా వ్యాక్సిన్ కలకలం రేపుతోంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా తీసుకున్న వారిలో ఏడుగురు రక్తం గడ్డకట్టడంతో మరణించారు.

ఇప్పటికే 1.8 కోట్ల మంది ప్రజలు ఆస్ట్రాజెనికా టీకాను యూకేలో తీసుకున్నారు. టీకా తీసుకున్నవారిలో ఏడుగురు వ్యక్తులు రక్తం గడ్డకట్టడం ద్వారా మరణించినట్టు  యూకే హెల్త్ రెగ్యులేటరీ సంస్థ ప్రకటించింది. అయితే, ఇది టీకా వలన జరిగిందా మరేదైనా కారణమా అన్నది పూర్తిగా తేలలేదని చెప్పింది.

యూకే లోని మెడికల్ అండ్ హెల్త్ రేగులటరీ ఏజన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చెబుతున్నదాని ప్రకారం బ్రిటన్ లో ఆస్ట్రాజెనికా వాక్సిన్ తీసుకున్న వారిలో 30 మందికి రక్తం గడ్డకట్టినట్టినట్టు గుర్తించారు. సెరిబ్రల్ వెయిన్ థ్రోమ్బోసిస్ లక్షణాలతో 22 మంది, ఇతర రకాలైన థ్రోమ్బోసిస్ తో 8 మంది బాధపడుతున్నట్టు మార్చి 24 వతేదీన గుర్తించారు. దీంతో వివిధ ప్రాంతాల్లో  ఆస్ట్రాజెనికా టీకా వినియోగంపై ఆంక్షలు విధించారు.

కెనడాలో 55 ఎల్లా వయసులోపు వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, జెర్మనీలో కూడా 60 సంవత్సరాల లోపు వారికి ఈ టీకా ఇవ్వకుండా ఆంక్షలు విధించారు.  అయితే, బ్రిటన్ మాత్రం ఈ వ్యాక్సిన్ అన్నివయసుల వారికీ సురక్షితం అనే చెబుతోంది.

ఇప్పటివరకూ బ్రిటన్ లో 31 మిలియన్ల మంది కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వారిలో 18 మిలియన్ల మంది ఆస్ట్రాజెనికా టీకాను వేయించుకున్నారు.

Also Read: అమెరికా క్యాపిటల్‌ భవనం తాత్కాలికంగా మూసివేత.. 6 వరకు వైట్‌హౌస్‌లో జాతీయ జెండాను అవనతం చేయాలని బైడెన్‌ ఆదేశం

Corona Vaccination: హెల్త్ వర్కర్లు..ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వాక్సిన్ కోసం ఇకపై కొత్తగా ప్రత్యేక రిజిస్ట్రేషన్లు లేవు: కేంద్రం ప్రకటన