UK F-35: కేరళ సీన్‌ రిపీట్‌.. జపాన్‌లో మరో బ్రిటన్‌కు ఫైటర్‌ జెట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్‌లను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. హైడ్రాలిక్‌ సమస్య కారణంగా ఇటీవలే కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌ పోర్టులొ ఒక ఫైటర్‌ జెట్‌ అత్యవసరంగా ల్యాండింగ్‌ కాగా.. తాగాజా అదే దేశానికి చెందిన మరో ఫైటర్‌ జెట్‌ సాంకేతిక సమస్యతో జపాన్‌‌లోని కొగొషిమా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండవ్వాల్సి వచ్చింది.

UK F-35: కేరళ సీన్‌ రిపీట్‌.. జపాన్‌లో మరో బ్రిటన్‌కు ఫైటర్‌ జెట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!
British F 35 Jet

Updated on: Aug 11, 2025 | 1:17 AM

బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్‌లను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. హైడ్రాలిక్‌ సమస్య కారణంగా ఇటీవలే కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌ పోర్టులొ ఒక ఫైటర్‌ జెట్‌ అత్యవసరంగా ల్యాండింగ్‌ కాగా.. తాగాజా అదే దేశానికి చెందిన మరో ఫైటర్‌ జెట్‌ సాంకేతిక సమస్యతో జపాన్‌‌లోని కొగొషిమా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండవ్వాల్సి వచ్చింది. జపాన్‌ మీడియా కథనాల ప్రకారం, కగోషిమా విమానాశ్రయంలో బ్రిటన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-35బి విమానంలో గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గమనించి అప్రమత్తమైన పైలెట్‌ విమానాన్ని కగోషిమా ఎయిర్‌పోర్టులో దింపేందుకు ఏటీసీకి సమాచారం ఇచ్చారు. ఇందుకు ఏటీసీ అంగీకరించడంతో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం కగోషిమా ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

అయితే బ్రిటన్ విమానం ల్యాండ్‌ అయ్యేందుకు ప్రత్యేక రన్‌ వేను కేటాయించడంతో.. జపాన్‌కు చెందిన ఇతర విమానాల రాకపోకలకు సుమారు 20 నిమిషాల పాటు అంతరాయం కలిగినట్టు కగోషిమా ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఈ జెట్ ప్రస్తుతం జపాన్ మారిటైమ్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్, యుఎస్ దళాలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో నిమగ్నమై ఉంది. ఆగస్టు 4న మొదలైన ఈ జాయింట్ డ్రిల్స్ వచ్చే మంగళవారం వరకూ కొనసాగుతాయి.

వీడియో చూడండి..

గత జూన్ నెలలో బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు వెళుతున్న ఎఫ్-35బి విమానం కూడా ఇలానే సాంకేతిక లోపం కారణంగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాంగింగ్ అయింది. అప్పుడు విమానం గాలిలో ఉండగా హైడ్రాలిక్ వ్యవస్థలో వైఫల్యం కావడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దాదాపు ఐదు వారాల పాటు భారత్‌లోనే ఉన్న ఈ ఫైటర్‌ జెట్‌కు అమెరికా నుంచి వచ్చిన నిపుణుల బృందం మరమ్మతులు చేయడంతో తిరిగి బ్రిటన్‌కు వెళ్లిపోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.