Afghanistan :ఆఫ్ఘనిస్తాన్ లో విదేశీ సైనిక బలగాలు నిష్క్రమించాల్సిందే ! తాలిబన్ల హెచ్చరిక..లేకుంటే …?

ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికీ ఉన్న విదేశీ సైనిక బలగాలు ఇక్కడి నుంచి నిష్క్రమించాల్సిందేనని తాలిబన్లు హెచ్చరించారు.కాబూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఇతర దౌత్య కార్యాలయాలను రక్షించడానికి ఇప్పటికీ ఇక్కడ అమెరికాకు చెందిన వెయ్యి ట్రూప్స్ ఉన్న నేపథ్యంలో వారీ హెచ్చరిక...

Afghanistan :ఆఫ్ఘనిస్తాన్ లో విదేశీ సైనిక బలగాలు నిష్క్రమించాల్సిందే ! తాలిబన్ల హెచ్చరిక..లేకుంటే ...?
All Foreign Troops Must Leave By Deadline Says Talibans,afghanistan,foreign Troops,leave,talibans Warning,us Forces
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 05, 2021 | 4:12 PM

ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికీ ఉన్న విదేశీ సైనిక బలగాలు ఇక్కడి నుంచి నిష్క్రమించాల్సిందేనని తాలిబన్లు హెచ్చరించారు.కాబూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఇతర దౌత్య కార్యాలయాలను రక్షించడానికి ఇప్పటికీ ఇక్కడ అమెరికాకు చెందిన వెయ్యి ట్రూప్స్ ఉన్న నేపథ్యంలో వారీ హెచ్చరిక చేరినట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ లో 20 ఏళ్ళ సైనిక బలగాల ఉనికి దాదాపు ముగిసింది. కానీ నేటో దేశాల బలగాలు కూడా ఉన్నట్టు తాలిబన్లు అనుమానిస్తున్నారు., అల్ ఖైదా గానీ మరే ఇతర ఉగ్రవాద సంస్థలు గానీ తమ కార్యకలాపాలు నిర్వహించకుండా వారిని అడ్డుకోవాలని అప్పుడే బలగాల ఉపసంహరణకు అంగీకరిస్తామని అమెరికా. దాని నేటో మిత్ర దేశాలు తాలిబన్లను కోరాయి. ఈ మేరకుఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సెప్టెంబరు 11 లోగా తమ దళాలు వెనక్కి రావాలని అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ ఇదివరకే ఆదేశించారు. కానీ కొన్ని కంపెనీల సైనికులు ఇక్కడే ఉన్నారు. మేం ఒకటే కోర్టుతున్నాం..అమెరికా ఏదేశ బలగాలైనా ఇక్కడ ఉండడానికి సహించం అని తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహిన్ అన్నారు.

దోహా ఒప్పందానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఎలా ముందుకు వెళ్లాలో, ఏ చర్యలు తీసుకోవాలో తమ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆయన చెప్పాడు. మేము విదేశీ సైనికుల ఉనికినే వ్యతిరేకిస్తున్నాం..అంతే తప్ప దౌత్యాధికారులను, స్వచ్చంద సంస్థలను కాదు అని ఆయన వివరించాడు. సదర్న్ కాందహార్ ప్రాంతంలో మరో ప్రాంతాన్ని కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని దాదాపు 400 జిల్లాల్లో సుమారు పావు భాగం తమ కంట్రోల్ లోకి వచ్చిందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. అవసరాన్ని బట్టి తాము మరింత ముందుకు వెళ్తామని వారు ఇదివరకే హెచ్చరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి:ఆషూ రెడ్డి అడవి పంది అంటూ రచ్చ.. అషూ రెడ్డి వీడియో లీక్ చేసిన యాంకర్ రవి..:anchor ravi on ashu reddy video.

అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనత:Indian Woman fly in space video.

Birthday cake help video:చిరుత దాడినుంచి అన్నదమ్ముల ఇద్దరిని కాపాడిన బర్త్‌డే కేక్‌..! వైరల్ అవుతున్న వీడియో.

పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..జీవితాంతం కన్యగా ఉంటా కానీ తాగుబోతును పెళ్లాడను అంటూ..:Bride cancel wedding video.