Afghanistan: తాలిబన్ ల సరికొత్త రూల్.. ఇకపై అలా చేసినా చట్టపరంగా శిక్షార్హులే

అఫ్గానిస్థాన్ (Afghanistan) లో ఆంక్షలు రోజురోజుకు మరింత ఎక్కువ అవుతున్నాయి. తాలిబన్ ప్రభుత్వం పాలనపగ్గాలు చేపట్టినప్పటి నుంచి చిత్రవిచిత్రమైన నిబంధనలు, కఠినమైన ఆదేశాలు జారీ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా....

Afghanistan: తాలిబన్ ల సరికొత్త రూల్.. ఇకపై అలా చేసినా చట్టపరంగా శిక్షార్హులే
Taliban
Follow us

|

Updated on: Jul 24, 2022 | 1:16 PM

అఫ్గానిస్థాన్ (Afghanistan) లో ఆంక్షలు రోజురోజుకు మరింత ఎక్కువ అవుతున్నాయి. తాలిబన్ ప్రభుత్వం పాలనపగ్గాలు చేపట్టినప్పటి నుంచి చిత్రవిచిత్రమైన నిబంధనలు, కఠినమైన ఆదేశాలు జారీ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇప్పటికే బాలికల విద్యపై నిషేధం, మహిళలు ఉద్యోగాలు చేయకుండా నియంత్రించారు. దీంతో పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటిని అరికట్టేందుకు తాలిబన్లు (Talibans) మరో నిర్ణయం తీసుకున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వ ఉద్యోగులను, మేధావులను విమర్శిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మాటలు, సైగలతో ఇలా ఏ విధంగానైనా విమర్శించిన వారు శిక్షార్హులని ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ల అగ్ర నేత అఖుంద్‌జాదా ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.

అయితే విమర్శలు చేసేవారు శిక్షార్హులుగా ప్రకటించిన తాలిబన్లు.. ఎలాంటి శిక్ష విధిస్తారోననే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై సోషల్ మీడియా, టీవీ డిబేట్లలో విద్యావేత్తలు, నిపుణులు ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా.. ప్రభుత్వంపై చేసే విమర్శలు పరోక్షంగా శత్రువులకు సాయం చేస్తాయని తాలిబన్లు అంటున్నారు. ప్రస్తుతానికి రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇక్కడి ప్రభుత్వంతో పోరాడుతోంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఎవరైనా తాలిబన్‌ సైనికుడిని తాకినా, లేదా అతని దుస్తులు లాగినా, చెడుగా మాట్లాడినా శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు.

కాగా.. ఈ ఆదేశాలతో వాక్‌స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఈ స్వేచ్ఛ తాజా ఆదేశాలు అమలు చేస్తే అసలే లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..