మొక్కై వంగనిదే మానై వంగునా అనేది సామెత. ఏదైనా మంచి విషయాలు నేర్పించాలంటే వారికి చిన్నప్పటి నుంచి ఆ విషయం గురించి వివరించాలి. అప్పుడే వారిలో మార్పు వస్తుంది. అంతే గానీ చిన్నప్పుడు వారిలో మంచి ప్రవర్తన కలిగించకుండా పెద్దయ్యాక వాటంతట అవే వస్తాయనుకోవడం చాలా తప్పు. చిన్నారులకు మంచి విషయాలు నేర్పించడంలో తల్లిదండ్రులది ముఖ్యపాత్ర. వారి తర్వాత ఉపాధ్యాయులదే. స్కూల్లో వివిధ బ్యాక్ గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. వారందరికీ తాము సమానమనే భావన కలిగించేది కేవలం స్కూల్ మాత్రమే. చిన్నప్పుడు వేసే ప్రతి అడుగూ.. భవిష్యత్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ గా మారుతుంది. ముఖ్యంగా చిన్నారులకు సమాజంలో వారి పాత్ర పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. బాధ్యతలు, బంధుత్వాలు, బంధాల పట్ల అవగాహన కలిగించాలి. వారిలో నడుచుకోవాల్సిన ప్రవర్తనపై సదాభిప్రాయాన్ని కలిగించాలి. అంతే గానీ బుక్స్, ఎగ్జామ్స్, రిజల్స్ట్, ర్యాంకులు అంటూ వారిపై ఒత్తిడి తీసుకురావద్దు.
సాధారణంగా స్కూల్ అంటేనే చదువులు, ర్యాంకులకు పరిమితమయ్యాయనే భావన చాలా మందిలో ఉంది. అయితే జపాన్ లో ఉన్న ఓ స్కూల్ మాత్రం మిగతా స్కూళ్లకు చాలా విరుద్ధం. ఇతరుల పట్ల ఎలా వ్యవహరించాలో తెలుపుతూ సమాజంలో వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. స్కూల్లో చిన్నారులకు కర్టసీ పాఠాలను బోధిస్తున్న వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో బస్‌లో ప్రయాణించే వివిధ ప్రయాణీకుల పాత్రల్లో పిల్లలు కనిపించి తమ నటనతో ఆకట్టుకున్నారు. కర్టసీ లెసన్స్‌లో భాగంగా చిన్నారులు అవసరార్ధులకు తాము కూర్చున్న సీట్లను ఆఫర్ చేయడం కనిపిస్తుంది.
జపాన్‌లో ఎలిమెంటరీ స్కూల్ చిన్నారులకు కర్టసీ పాఠాలు బోధిస్తున్నారని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే చాలా మంది వీక్షకులు చూశారు. చూసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ వీడియో అన్ని వయసులు, వర్గాల ప్రజలకు అవసరమైన కీలక పాఠమని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పిల్లలు ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టకుండా ఇలాంటి బేసిక్ లెసన్స్ కూడా నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This is a ‘courtesy lesson’ taught to elementary school children in Japan. pic.twitter.com/07VKivGZe9
— Awanish Sharan (@AwanishSharan) December 8, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి