California Wildfire: అగ్నికి అహుతవుతున్న వందలాది గృహాలు.. ఎంతో మందికి గాయాలు.. ఇతర ప్రాంతాలకు తరలింపు

California Wildfire: కాలిఫోర్నియా స్టేట్‌ను భారీ కార్చిచ్చు వణికిస్తోంది. ఇప్పటి వరకూ వంద గృహాలు అగ్నికి ఆహుతైపోయాయి. ఈ కార్చిచ్చులో ఎంతో మంది గాయపడ్డారు. వేలాది మందిని..

California Wildfire: అగ్నికి అహుతవుతున్న వందలాది గృహాలు.. ఎంతో మందికి గాయాలు.. ఇతర ప్రాంతాలకు తరలింపు
California Wildfire
Follow us

|

Updated on: Sep 05, 2022 | 10:06 AM

California Wildfire: కాలిఫోర్నియా స్టేట్‌ను భారీ కార్చిచ్చు వణికిస్తోంది. ఇప్పటి వరకూ వంద గృహాలు అగ్నికి ఆహుతైపోయాయి. ఈ కార్చిచ్చులో ఎంతో మంది గాయపడ్డారు. వేలాది మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా ఉత్తర కాలిఫోర్నియా గ్రామీణ ప్రాంతంలో మరోసారి భారీ స్థాయిలో అడవి మంటలు చెలరేగాయి. ఇక్కడి పర్వతాలపై అడవులు మంటల్లో చిక్కుకున్నాయి. వారం రోజులుగా మంటలు విస్తరిస్తూ అడవులను దహించేస్తున్నాయి. సిస్కియో కౌంటీలో పరిస్థితి తీవ్రంగా మారడంతో కాలిఫోర్నియా గావిన్ న్యూసోమ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంటలు జనావాస ప్రాంతాలకు విస్తరించడంతో దాదాపు 100 ఇళ్లు, భవనాలు బూడిదగా మారాయి. మంటల్లో పలువురు చిక్కికుని గాయపడ్డారు. అప్రమత్తమై అధికారులు ఇక్కడి ప్రజలను ఇళ్ల నుంచి బలవంతంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపారు. దాదాపు ఏడున్నరవేల మంది ఇళ్లు ఖాళీ చేసి పోయారు. వీడ్‌తో పాటు షాస్టినా, ఎడ్జ్‌వుడ్‌ కమ్యూనిటీలను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

శాన్ ఫ్రాన్సిస్కోకు ఉత్తరాన 400 కిలో మీటర్ల దూరంలోని వీడ్‌ పట్టణంలో భారీ సంఖ్యలో ఇళ్లు కాలిపోయాయి.. ఇక్కడ ఉన్న రోజ్‌బర్గ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కలప మిల్లు మంటల్లో చిక్కి పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ పట్టణంలోని దాదాపు రెండున్నర వేల మంది తమ ఇళ్లను ఖాళీ చేశారు. మరోవైపు కార్చిచ్చు లింకన్‌ హైట్స్‌లోని కూడా ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పేందుకు దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.. గంటకు 58 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో మంటలు మరింతగా విస్తరించాయి. అతి కష్టం మీద 20 శాతం మేరకు కార్చిచ్చును అదుపుతోకి తేగలిగారు ఫైర్‌ సిబ్బంది. అడవి మంటల కారణంగా విద్యుత్ సరఫరాలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాలిఫోర్నియాలో ప్రతి ఏటా ఈ సీజన్‌లో కార్చిచ్చులు సర్వసాధారణంగా మారాయి.. తాజా గత కొద్ది రోజులుగా వీస్తున్న వేడి గాలులకు కార్చిచ్చులు తోడయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి