బ్రెజిల్‌లో దారుణం.. జైల్లో ఘర్షణ.. 52మంది మృతి

బ్రెజిల్‌లో దారుణం జరిగింది. ఉత్తర బ్రెజిల్‌లోని జైల్లో సోమవారం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 52మంది మృతి చెందారు. అందులో 16మంది శిరచ్ఛేదనకు గురవ్వగా.. మిగిలిన వారు ఊపిరి ఆడక చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అల్టమీరా ప్రాంతంలో పునరుద్ధరణ కేంద్రంలో ఉదయం 7గంటలకు కొమండో వెర్మిల్హో, కొమాండో క్లాస్ ఏ అనే రెండు గ్రూపుల మధ్య తలెత్తిన అల్లర్ల కారణంగా పరిస్థితి అదుపుతప్పినట్లు జైలు అధికారులు తెలిపారు. కమాండో క్లాస్‌ ఏకు చెందిన ఖైదీలు కొమాండో […]

బ్రెజిల్‌లో దారుణం.. జైల్లో ఘర్షణ.. 52మంది మృతి

బ్రెజిల్‌లో దారుణం జరిగింది. ఉత్తర బ్రెజిల్‌లోని జైల్లో సోమవారం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 52మంది మృతి చెందారు. అందులో 16మంది శిరచ్ఛేదనకు గురవ్వగా.. మిగిలిన వారు ఊపిరి ఆడక చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అల్టమీరా ప్రాంతంలో పునరుద్ధరణ కేంద్రంలో ఉదయం 7గంటలకు కొమండో వెర్మిల్హో, కొమాండో క్లాస్ ఏ అనే రెండు గ్రూపుల మధ్య తలెత్తిన అల్లర్ల కారణంగా పరిస్థితి అదుపుతప్పినట్లు జైలు అధికారులు తెలిపారు.

కమాండో క్లాస్‌ ఏకు చెందిన ఖైదీలు కొమాండో వెర్మోల్హోలు ఉండే సెల్‌కు నిప్పును పెట్టారని.. అది కాస్త విస్తరిస్తూ పెద్ద ప్రమాదంగా మారిందని జైళ్ల శాఖ చీప్ జర్బస్ వాస్కోన్‌సెలోస్ వివరించారు. ఆ తరువాత పొగలు దట్టంగా రావడంతో జైళ్లోకి పోలీసులు ప్రవేశించేందుకు చాలా సమయం పట్టిందని చెప్పారు. అయితే ఈ అల్లర్లలో మృతి చెందిన 16మంది ఖైదీలు.. కొన్ని నెలల కిందట మరో జైలు నుంచి వచ్చారు. కాగా అమెరికా, చైనా తరువాత బ్రెజిల్ జైళ్లలో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉన్నది. గత కొంతకాలంగా అక్కడి జైళ్లలో గ్రూపుల మధ్య ఘర్షణలు, హింసాత్మక అల్లర్లు తరచుగా జరుగుతుంటాయి.

Published On - 7:29 am, Tue, 30 July 19

Click on your DTH Provider to Add TV9 Telugu