Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..

నేపాల్‌లోని నువాకోట్ జిల్లా బెల్కోట్‌గాడి పరిసర ప్రాంతాల్లో ఉదయం 5.26 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు

Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..
Nepal Earthquake
Follow us

|

Updated on: Aug 06, 2022 | 6:38 AM

Earthquake in Nepal: నేపాల్‌లో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆరు రోజుల క్రితం నేపాల్‌లోని ధితుంగ్‌లో భారీ భూప్రకంపనలు సంభవించగా.. తాజాగా శనివారం తెల్లవారుజామున మరోసారి భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. నేపాల్‌లోని నువాకోట్ జిల్లా బెల్కోట్‌గాడి పరిసర ప్రాంతాల్లో ఉదయం 5.26 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్‌ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. భారీ భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అందరూ నిద్రలో ఉండగా భారీ భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నేపాల్‌లోని అనేక ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభించినట్లు అధికారులు తెలిపారు. బాగ్‌మతి ప్రావిన్స్‌లోని ఖాట్మండుకు వాయువ్యంగా 35 కిమీ దూరంలో 4.4 తీవ్రతో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు. ప్రాణ, ఆస్థి నష్టానికి సంబంధించి ఎలాంటి సమచారం అందలేదని అధికారులు తెలిపారు. కాగా.. గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలతో నేపాల్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అంతకు మందు సంభవించిన భారీ భూకంపాలతో వందలాది మంది మరణించిన విషయం తెలిసిందే.

గత ఆదివారం ఖాట్మండుకు తూర్పు-ఆగ్నేయంగా 147 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధితుంగ్‌లో భూకంపం సంభవించింది. 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతోపాటు భారత్‌లోని బీహార్‌లో సీతామర్హి, ముజఫర్‌పూర్, భాగల్‌పూర్‌లలో భూప్రకంపనలు సంభవించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..