ప్ర‌పంచంపై కోవిడ్‌ టెర్ర‌ర్.. ఉధృతంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే..

ప్ర‌పంచంపై కోవిడ్‌ టెర్ర‌ర్.. ఉధృతంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 9:27 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,92,57,649కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 7,17,687 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 61,82,308 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,30,75,341 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 50,32,179కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,62,804 మంది మృతి చెందారు. కాగా 22,92,707 యాక్టీవ్ కేసులు ఉండగా, 25,76,668 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 56,282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,64,536కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,95,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 13,28,336 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 904 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌పడి 40,699 మంది మరణించారు.

Read More:

అర‌కులో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు స‌తీమ‌ణి మృతి

కొత్తగా 13 మంది స‌బ్ క‌లెక్ట‌ర్‌ల‌ను నియ‌మించిన ఏపీ ప్ర‌భుత్వం

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్