టూరిస్టులకు వెల్​కమ్​ చెప్పబోతున్న దేశాలు..!

లాక్ డౌన్ సడలింపులతో మళ్లీ టూరిస్టులకు వెల్​కమ్​ చెప్పాలని అనుకుంటున్నాయి. మళ్లీ తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను వెతుకుంటున్నాయి ప్రపంచ దేశాలు.

టూరిస్టులకు వెల్​కమ్​ చెప్పబోతున్న దేశాలు..!
Follow us

|

Updated on: Jun 06, 2020 | 3:41 PM

సెలవులు వచ్చాయంటే చాలు విహార యాత్రలతో ప్రపంచాన్ని చుట్టేసి రావాలని అనుకునేటోళ్లను కరోనా ఇళ్లలోనే కట్టిపడేసింది. లాక్ డౌన్ టూరిస్టుల కాళ్లకు బంధాలు వేసింది. దీంతో టూరిజం మీదే ఆధారపడ్డ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. రాకపోకలు నిలిచిపోయి ఇటు రవాణా, వ్యాపార, వాణిజ్య, హాస్పిటాలిటి రంగాలు కుదేలయ్యాయి. ఉపాధి కోల్పోయి పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో ఆయా దేశాలు టూరిజం విభాగాన్ని గడిలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తిరిగి టూరిస్టులను రప్పించేందుకు తలుపులు తెరుస్తున్నారు. దాదాపు రెండు నెలలపాటు గడపదాటని వారిని ఆకర్షించేందుకు టూరిస్ట్ సంస్థలు ఫ్లాన్ చేస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో మళ్లీ టూరిస్టులకు వెల్​కమ్​ చెప్పాలని అనుకుంటున్నాయి. మళ్లీ తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను వెతుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పర్యాటక కేంద్రాలు ఉన్న దేశం ఫ్రాన్స్​. ఎక్కువ టూరిస్టులను ఆకర్షిస్తోంది. అటు, కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నదీ ఇక్కడే. దీంతో ఫ్రాన్స్ కి టూరిస్టుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణకు మళ్లీ ఇంటర్నేషనల్​ ట్రావెలర్లను ఆకర్షించేందుకు ఫ్లాన్ చేస్తోంది ఫ్రాన్స్. అయితే, యూరోపియన్​ యూనియన్​ దేశాలు మినహా వేరే దేశాల నుంచి వచ్చే వారికి మాత్రం అనుమతి ఇవ్వనుంది. కానీ, ఖచ్చితంగా 14 రోజుల క్వారంటైన్​లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇందుకు అనుగుణంగా టూరిస్టులు ఎక్కువగా సందర్శించే లూవర్​ మ్యూజియంను జులై 6 నుంచి ఓపెన్​ చేస్తామని మే 29న ప్రభుత్వం ప్రకటించింది. జులై నుంచి ఫ్రాన్స్​ ప్రజలంతా హాలిడే ట్రిప్పులకు వెళ్లొచ్చని చెప్పింది. ఇక గ్రీక్ లోనూ వీలైనంత తొందరగానే టూరిజం సెక్టార్​ను ఓపెన్​ చేయాలని ఆ దేశం నిర్ణయించింది. వీలైతే జూన్​ 15 నుంచే ఓపెన్​ చేసేందుకు అక్కడ ప్రభుత్వ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు హోటళ్లకు వసతి గృహాలకు తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అటు వెయ్యికిపైగా దీవులు కలిసిన ఐలాండ్​ దేశం మాల్దీవ్స్ ఇదే దారిలోకి వచ్చాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విడతల వారీగా ఓపెన్​ చేస్తోంది. ఇప్పటికే జూన్​ 1న సూపర్​యాట్​లు, జెట్​లను అనుమతించింది. జులై నుంచి విదేశీ టూరిస్టులూ వచ్చేందుకు ఓకే చెప్పేసింది. ఇక జూన్​ 15 నుంచి యూరప్​ కంట్రీస్​కు బార్డర్లు తెరవనుంది జర్మనీ. టర్కీ, బ్రిటన్​, ఐస్లాండ్​, నార్వే, స్విట్జర్లాండ్​ వంటి దేశాలకూ అనుమతివ్వనుంది. జూన్​ 3 నుంచే బ్రిటన్​ సహా యూరప్​ దేశాలకు ఓకే చెప్పింది ఇటలీ. కొన్ని దేశాలు క్వారంటైన్​ రూల్​ పెడుతున్నా.. ఇటలీ మాత్రం అలాంటిదేమీ అవసరం లేదని చెప్పింది. అటు జులై 1 నుంచి టూరిస్టులకు స్పెయిన్​ అనుమతి ఇవ్వనుంది. జూన్​ 15 తర్వాత విదేశీ టూరిస్టులకు గేట్లు ఓపెన్​ చేయాలని పోర్చుగల్​ భావిస్తోంది. అందులో భాగంగా ‘డోంట్​ క్యాన్సిల్​, పోస్ట్​పోన్​’ స్కీమ్​ను ప్రారంభించింది. ఇప్పటికే బుక్​ చేసుకున్న టూర్​లను 2021 చివరి వరకు ఎప్పుడైనా రీషెడ్యూల్​ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జూన్​ 4 నుంచి కరీబియన్​ దీవుల్లో ఒకటైన సెయింట్​ లూసియా జూన్​ 4 నుంచి టూరిజం గేట్లు తెరిచింది. అయితే, వివిధ దేశాల నుంచి వచ్చేటోళ్లు ఫ్లైట్​ ఎక్కడానికి 48 గంటలకు ముందు కచ్చితంగా కరోనా నెగెటివ్​ సర్టిఫికెట్​ను ఇవ్వడాన్ని తప్పనిసరి చేశాయి అయా దేశాలు. కొన్ని దేశాల్లో టూరిస్టుల కోసం హోటళ్లు ఓపెన్​ చేయాలంటే రెసిడెంట్​ డాక్టర్​తో ఓ క్లినిక్​ను ఏర్పాటు చేయాల్సిందేనన్న మెలిక పెడుతున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు మాత్రం అనుమతి ఇవ్వద్దని భావిస్తున్నాయి.