వరల్డ్ టూరిజం డే.. భారత్‌‌‌ను చుట్టేద్దాం ఇలా..?

ఎప్పుడూ ఒకే చోట పని చేస్తూ.. చూసిన వారినే చూస్తూ.. డైలీ రొటీన్ లైఫ్‌ అనే చట్రంలో ఇరుక్కుపోతుంటాం. ఇదేనా జీవితం.. ఇంకేం లేదా అని అనిపిస్తుంది కూడా. అయితే ఈ జీవితం అనే డైలీ సీరియల్‌కు అప్పుడప్పుడూ విరామం అనేది ఇస్తుండాలి. మన బాధలు, కష్టాల నుంచి మనసును ప్రశాంతంగా ఉంచాలంటే.. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలని అనిపిస్తుంది. కొద్దిరోజులు లాంగ్ టూర్‌కు వెళ్తే అక్కడి అందాలు చూసి మనం మానసిక ఉల్లాసం పొందటమే కాకుండా […]

వరల్డ్ టూరిజం డే.. భారత్‌‌‌ను చుట్టేద్దాం ఇలా..?
Follow us

| Edited By: seoteam.veegam

Updated on: Sep 27, 2019 | 3:51 PM

ఎప్పుడూ ఒకే చోట పని చేస్తూ.. చూసిన వారినే చూస్తూ.. డైలీ రొటీన్ లైఫ్‌ అనే చట్రంలో ఇరుక్కుపోతుంటాం. ఇదేనా జీవితం.. ఇంకేం లేదా అని అనిపిస్తుంది కూడా. అయితే ఈ జీవితం అనే డైలీ సీరియల్‌కు అప్పుడప్పుడూ విరామం అనేది ఇస్తుండాలి. మన బాధలు, కష్టాల నుంచి మనసును ప్రశాంతంగా ఉంచాలంటే.. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలని అనిపిస్తుంది. కొద్దిరోజులు లాంగ్ టూర్‌కు వెళ్తే అక్కడి అందాలు చూసి మనం మానసిక ఉల్లాసం పొందటమే కాకుండా ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకుంటాం. మనం చేసే ఈ చిన్న ప్రయాణమే మనకు ఎన్నో నేర్పిస్తుంది. ఆఖరికి ఈ ట్రావెల్‌ ద్వారా మన జీవితంలో కొత్తగా మార్పులు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకేనేమో ఇలాంటి ఉద్దేశాలతో ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేకతను పురస్కరించుకుని ఇండియాలోని కొన్ని అద్భుతమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

ఇండియాలోని పర్యాటక ప్రదేశాల గురించి చర్చించుకునేటప్పుడు మొదటగా మన దృష్టిలోకి వచ్చేది తాజ్ మహల్. ప్రపంచ వింతల్లో ఒకటైన, ప్రేమకు చిహ్నంగా చెప్పబడే ఈ తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. ఆ తర్వాత శైవక్షేత్రం వారణాసి ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇకపోతే మనాలి, కసౌలి, ధర్మశాల మొదలుగు ప్రదేశాలు చూడముచ్చటగా ఉంటూ పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. కాగా ఇవన్నీ హిమాలయ పర్వతాలకు అనుకోని ఉండటంతో అక్కడి సహజసిద్ధమైన మంచు, ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

మరోవైపు నార్త్ ఈస్ట్ ఇండియాలో చెప్పుకోదగ్గ ప్రదేశాలెన్నో ఉన్నాయి. దసరా సీజన్ వచ్చిందంటే చాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాదేవి శోభతో శోభాయమానంగా వెలిగిపోతుంది. ముఖ్యంగా కోల్‌కతా నగరంలో ఈ సందడే వేరు. దుర్గాదేవి పూజ, నవరాత్రులు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా హౌరా బ్రిడ్జితో పాటుగా పలు చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చుట్టుపక్కల ఉన్నాయి.

ఆ తర్వాత గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉప్పుతో కూడిన నేలలు, గిర్ అటవీ ప్రాంతం తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలోని పింక్ సిటీగా పిలువబడే జైపూర్, థార్ ఎడారి చూడదగ్గ ప్రదేశాలు. ఇకపోతే కర్ణాటక – మహారాష్ట్ర- గోవా రాష్ట్రల సరిహద్దుల మధ్య కొంకణ్ ప్రాంతంలో రైలు ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుంది. పచ్చని గడ్డి, కొండలు, చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఒకవైపు.. అరేబియా సముద్రం మరోవైపు ఉండటంతో భలే మజాగా ఉంటుంది. ఇక కేరళ రాష్ట్రంలోని మున్నార్ ప్రాంతంలో ఉండే హిల్ స్టేషన్స్, కాఫీ తోటలు, సన్ రైజ్ అన్నీ కూడా ఒక రొమాంటిక్ ఫీల్‌ను అందిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి ప్రదేశాలను యువత అమితంగా ఇష్టపడతారు. అంతేకాకుండా ఎక్కువగా జంటలు ఈ టూరిస్ట్ స్పాట్స్‌ను సందర్శిస్తారు. ఇలా ఒకటేమిటి.. ఎన్నో అద్భుత, అపురూపమైన పర్యాటక ప్రదేశాలు భారతదేశం నలుమూలలా ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే