ఫుల్ జోష్‌తో గ్రాండ్ వెలకమ్.. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు.. నూతన ఏడాదికి ఘన స్వాగతం..

తీపి జ్జాపకాలను వీడ్కోలు పలుకుతూ.. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న న్యూ ఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి.

ఫుల్ జోష్‌తో గ్రాండ్ వెలకమ్.. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు.. నూతన ఏడాదికి ఘన స్వాగతం..
Follow us

|

Updated on: Jan 01, 2021 | 7:02 AM

తీపి జ్జాపకాలను వీడ్కోలు పలుకుతూ.. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న న్యూ ఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా జనం కొత్త ఏడాదికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. చాలా దేశాల్లో ఆంక్షల నడుమ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. తొలుత న్యూజిల్యాండ్‌లోని ఆక్లాండ్‌ నగరవాసులు మొదట న్యూ ఇయర్‌కు వెల్‌కమ్‌ చెప్పారు.

పాత ఏడాది 2020కి గుడ్‌బై చెబుతూ.. 2021కి ఘన స్వాగతం పలికారు వివిధ దేశాల ప్రజలు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో భారీగా వేడుకలు నిర్వహించారు. బాణసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. థాయిల్యాండ్‌, తైవాన్‌తో పాటు ఆక్లాండ్‌ నగరం బాణసంచా ధగధగలతో మిరుమిట్లుగొల్పింది. మొదట న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌వాసులు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.ఆక్లాండ్‌లోని క్లాక్‌టవర్‌ కొన్ని నిమిషాల పాటు వెలుగు జిలుగులతో నిండిపోయింది. ప్రజలు ఆనంద ద్వానాలు చేస్తూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కరోనాతో కాకుండా.. కొత్త సంవత్సరం ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు.

మరోవైపు, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోనూ భారీగా వేడుకలు నిర్వహించారు. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన వెంటనే నగరంలో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. ప్రజలు హ్యాపీన్యూ ఇయర్‌ అంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. దుబాయిలో న్యూ ఇయర్‌ వేడకలను ఘనంగా జరుపుకొన్నారు అక్కడి ప్రజలు. దుబాయిలో ఉన్న అతి పెద్ద టవర్‌ బుర్జ్‌ ఖలీఫా విద్యుత్‌ దీపాలతో ధగధగలాడింది, కొన్ని నిమిషాల పాటు రంగు రంగుల విద్యుత్‌ కాంతులతో వెలిగిపోయింది టవర్‌. ఇక సౌత్‌ కొరియా సియోల్‌లోనూ భారీ వేడుక నిర్వహించారు. దాదాపు గంటపాటు బాణసంచా కాల్చారు. కొరియన్‌ స్టైల్లో న్యూఇయర్‌ వేడుకలు జరిగాయి. సియోల్‌ నగరం వెలుగులతో మెరిసిపోయింది.

ఏడాది మొత్తం ఉద్యమంతో అట్టుడికిన హాంకాంగ్‌లో న్యూ ఇయర్‌ను తమ స్టైల్లో జరుపుకున్నారు అక్కడి ప్రజలు. అద్భుతమైన క్రాకర్స్‌ మెరుపులలో.. హాంకాంగ్‌ అందంగా కనిపించింది. ఈ ఏడాది కరోనా నుంచి విముక్తి కలగాలని ప్రజలు కోరుకున్నారు. అటు చైనాలోనూ న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయి. చైనా రాజధాని బీజింగ్‌లో కలర్‌ఫుల్‌గా జరుపుకున్నారు స్థానికులు. ఆటపాటలతో అంతా సందడి చేశారు. అయితే.. ఈసారి టపాసులకు బదులు.. లైటింగ్‌ షోతోనే సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. జపాన్‌లోనూ న్యూ ఇయర్‌ సంబరాలు అంబరాన్నంటాయి. రష్యా రాజధాని మాస్కోలోనూ న్యూ ఇయర్‌ వేడకలను ఘనంగా జరుపుకున్నారు స్థానికులు.