Breaking News
  • ప.గో: చింతలపూడి జెడ్పీ పాఠశాలలో లైంగిక వేధింపులు. మహిళా టీచర్‌ను లైంగికంగా వేధిస్తున్న తోటి టీచర్‌. డీఈవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్‌.
  • తిరుపతి: పలమనేరు అటవీప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల కేసు. 8 మందిపై కేసునమోదు, ఇప్పటికే పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు ఏర్పాటు. కీలక నిందితుడు చెన్నైకి చెందిన స్వామీ జయచంద్రన్‌ కోసం గాలింపు. రుయాలో చికిత్సపొందుతున్న బాధితుడు గణేష్‌ పరిస్థితి విషమం. కాలిన గాయాలతో ఈ నెల 12న ఆస్పత్రిలో చేరిన గణేష్‌. గణేష్‌ను నరబలి ఇచ్చేందుకు యత్నించారంటున్న కుటుంబసభ్యులు. విద్యుత్‌షాక్‌తో గణేష్‌ ప్రమాదానికి గురయ్యాడంటున్న పోలీసులు.
  • టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి భూకబ్జా, కేసుల చిట్టా. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.
  • గోపన్‌పల్లి భూవివాదంపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ . కొండల్‌రెడ్డితో అప్పటి తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి కుమ్మక్కయ్యారు. గోపన్‌పల్లి భూ వివాదంలో అప్పటి తహశీల్దార్‌ అవకతవకలకు పాల్పడ్డారు. కొండల్‌రెడ్డికి సంబంధం లేని భూమిని శ్రీనివాస్‌రెడ్డి మ్యుటేషన్‌ చేయించారు. -టీవీ9తో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌. డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాస్‌రెడ్డి తన అధికారాలకు విరుద్ధంగా.. రికార్డుల్లో లేనివ్యక్తి భూమిని కొండల్‌రెడ్డికి మ్యుటేషన్ చేయించారు. ఈ వివాదంలో మరో ఇద్దరు తహశీల్దార్ల పాత్ర కూడా గుర్తించాం. తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి లేఖ రాశాం-టీవీ9తో రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్.
  • గోపన్‌పల్లి భూవివాదంలో గతంలోనే రేవంత్‌రెడ్డిపై కేసులు. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.

World Famous Lover : డివైడ్ టాక్..రూ. 30 కోట్లు కష్టమేగా రౌడీ హీరో..

World Famous Lover Vijay Devarakonda Latest News, World Famous Lover : డివైడ్ టాక్..రూ. 30 కోట్లు కష్టమేగా రౌడీ హీరో..

World Famous Lover: హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏది చేసినా సంచలనమే. టిపికల్ బాడీ లాంగ్వేజ్‌లో, క్రేజీ యాట్యిట్యూడ్‌లో భారీ ఫ్యాన్ బేస్‌ను సెట్ చేసుకున్నాడు. సహజంగా కొత్త హీరోలకు ప్లాపులు పడితే ఇమేజ్ డౌన్ అవుతోంది. అదేంటో విజయ్ వరసగా ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి మూవీస్ ప్లాపులు పడినా..అతే క్రేజ్‌తో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో శుక్రవారం రోజున ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గా ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.

ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ. 29 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటాలంటే వరల్డ్ వైడ్‌గా రూ. 30 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. అప్పుడే బయ్యర్స్, డిస్టిబ్యూటర్స్ సేఫ్ అవుతారు.

ఈ మూవీ రిలీజ్‌కి ముందు చేసిన బిజినెస్‌పై ఓ లుక్ వేద్దాం :

నిజాం : రూ. 7.50 కోట్లు

వైజాగ్ రైట్స్ :రూ. 2.50 కోట్లు

తూర్పు గోదావరి : రూ. 1.45 కోట్లు

పశ్చిమ గోదావరి : రూ. 1.25 కోట్లు

కృష్ణా  : రూ. 1.45 కోట్లు

గుంటూరు : 1.60 కోట్లు

నెల్లూరు : రూ. 0.77 కోట్లు

సీడెడ్  : రూ. 4 కోట్లు

మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.5 కోట్లు బిజినెస్ చేశాడు వరల్డ్ ఫేమస్ లవర్. ఇక కర్ణాటక, ఓవర్సీస్ మొత్తం కలిపి మరో 3 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయి. మొత్తం పబ్లిసిటీ ఖర్చులు కలుపుకుంటే రూ. 29 కోట్లుకు రీచ్ అయ్యింది. జస్ట్ హిట్ టాక్ వస్తే దేవరకొండకు ఈ వసూళ్లు చాలా సిల్లీ థింగ్. కానీ ప్రస్తుతం డివైడ్ టాక్ నడుస్తోంది కాబట్టి..కష్టాలు తప్పవేమో అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సి.

 

 

Related Tags