నేడు వరల్డ్ ఎమోజీ డే..!

మనసులో ఉన్న మాటలను చెప్పేందుకు కొన్ని కొన్ని సార్లు పదాలు చాలవు. అలాంటప్పుడు మనసులోని భావాలను ఎదుటివారికి చెప్పేందుకు ఉపయోగపడేవే ఎమోజీలు. సందర్భం ఏదైనా, ఆనందం, కోపం, బాధ ఇలా ఒక్కటేమిటి.. మనం చెప్పాలనుకునే మాటలను, మనస్సులోని భావాలను చాలా సులభంగా చెప్పేందుకు ఎమోజీలు చక్కగా పనిచేస్తాయి. ఎమోజీ అనేది జపనీస్ పదం. ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషలో యాప్స్‌లో ఎక్కువగా ఎమోజీలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజే ఎమోజీ డేని జరుపుకోవడానికి […]

నేడు వరల్డ్ ఎమోజీ డే..!
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 9:32 AM

మనసులో ఉన్న మాటలను చెప్పేందుకు కొన్ని కొన్ని సార్లు పదాలు చాలవు. అలాంటప్పుడు మనసులోని భావాలను ఎదుటివారికి చెప్పేందుకు ఉపయోగపడేవే ఎమోజీలు. సందర్భం ఏదైనా, ఆనందం, కోపం, బాధ ఇలా ఒక్కటేమిటి.. మనం చెప్పాలనుకునే మాటలను, మనస్సులోని భావాలను చాలా సులభంగా చెప్పేందుకు ఎమోజీలు చక్కగా పనిచేస్తాయి. ఎమోజీ అనేది జపనీస్ పదం.

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషలో యాప్స్‌లో ఎక్కువగా ఎమోజీలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజే ఎమోజీ డేని జరుపుకోవడానికి కారణాలు ఉన్నాయి. 1990లోనే ఎమోజీల వాడకం మొదలైంది. 2000 సంవత్సరం నుంచి వీటి వాడకం తారాస్థాయికి చేరుకుంది. జపాన్‌కు చెందిన ఎన్‌టీఈ డొకొమో అనే టెలికాం కంపెనీలో పనిచేస్తున్న షిగేటక కురిటా అనే వ్యక్తి.. వాతావరణ స్థితిగతులను తెలియజేసేందుకు ఎమోజీలను వాడాడు. దీంతో అతన్ని అందరూ మిస్టర్ ఎమోజీ అని పిలవడం మొదలు పెట్టారు.

ఇక 2002 జూలై 17న సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ క్యాలెండర్ ఎమోజీని తయారు చేసింది. దీనికి గుర్తుగా క్యాలెండర్‌లో జూలై 17వ తేదీయే డిఫాల్ట్‌గా ఉంటుంది. అయితే 2014లో జెర్మీ బర్జ్ అనే వ్యక్తి వికీపీడియా సైట్ లాగే ఎమోటికన్‌ల కోసం ప్రత్యేకంగా ఎమోజీపీడియాను రూపొందించాడు. ఇందులో యాపిల్ క్యాలెండర్ ఎమోజీని తయారు చేసిన రోజు జూలై 17నే ఆయన వరల్డ్ ఎమోజీ డేగా పేర్కొన్నాడు. అందుకే ఈ రోజునే వరల్డ్ ఎమోజీ డేగా జరుపుకుంటున్నారు. ఈ సారి వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా యాపిల్ సంస్థ పలు కొత్త ఎమోజీలను విడుదల చేసింది. దాదాపుగా 70కి పైగా నూతన ఎమోజీలను విడుదల చేసింది. అయితే ఇవి ఐఓఎస్ 12 అప్‌డేట్‌తో యూజర్లకు లభిస్తాయి. కాగా, ఐఫోన్, ఐప్యాడ్‌లలో ఇవి త్వరలో లభ్యమవుతాయి.