క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..సూపర్‌ ఓవర్‌పై ఐసీసీ కీలక నిర్ణయం

ఇక నుంచి వరల్డ్‌కప్ సెమీస్‌, పైనల్లో సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించబోమని ఐసీసీ పేర్కొంది. స్పష్టమైన విజేత తేలేవరకు సూపర్‌ ఓవర్లు ఆడిస్తామని స్పష్టం చేసింది. సోమవారం జరిగిన సమావేశంలో ఐసీసీ ఈ సెన్సేషనల్ డెషీసన్ తీసుకుంది. ఇప్పటి వరకు సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీలు అత్యధికంగా బాదిన జట్టును విజేతగా ప్రకటించేవారు. ఇటీవల ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ ఎంత హాట్ టాపిక్‌గా మారిందో అందరికి […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:00 am, Tue, 15 October 19

ఇక నుంచి వరల్డ్‌కప్ సెమీస్‌, పైనల్లో సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించబోమని ఐసీసీ పేర్కొంది. స్పష్టమైన విజేత తేలేవరకు సూపర్‌ ఓవర్లు ఆడిస్తామని స్పష్టం చేసింది. సోమవారం జరిగిన సమావేశంలో ఐసీసీ ఈ సెన్సేషనల్ డెషీసన్ తీసుకుంది. ఇప్పటి వరకు సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీలు అత్యధికంగా బాదిన జట్టును విజేతగా ప్రకటించేవారు.

ఇటీవల ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ ఎంత హాట్ టాపిక్‌గా మారిందో అందరికి తెలిసిన విషయమే. మ్యాచ్‌ టైగా మారడంతో ఇరుజట్లకు సూపర్‌ ఓవర్‌ ఆడించారు. కానీ సూపర్‌ఓవర్‌లో కూడా ఇరు జట్ల స్కోరు సమం కావడంతో అధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను  ప్రపంచ‌కప్ విజేతగా నిర్ణయించారు. ఐసీసీ నిబంధనలపై క్రికెటర్లు, మాజీలు, అభిమానులు పెద్దఎత్తున విమర్శించారు. సోషల్ మీడియా వేదిగా పాత చింతకాయపచ్చడి రూల్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో అనిల్‌కుంబ్లే నేతృత్వంలో సూపర్‌ఓవర్ నిబంధనలపై ఐసీసీ కమిటీని నియమించింది. కుంబ్లే కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.