సైన్యం ప్రాణాలా? పాక్‌తో క్రికెట్టా?: హర్భజన్ ఫైర్

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఆడటంపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. కొందరు ఆడి పాక్‌ను మట్టికరిపించాలని అంటుంటే కొందరు మాత్రం ససేమిరా వద్దంటున్నారు. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ స్పందిస్తూ పాకిస్థాన్‌పై ఫైరయ్యారు. దేశం కంటే ప్రపంచ కప్ ఏమీ పెద్దది కాదని అన్నాడు. ఒక పక్క మన సైనికుల ప్రాణాలు పోతుంటే అందుకు కారణమైన పాక్‌తో క్రికెట్ అవసరమా అని ప్రశ్నించాడు. దేశం ముందు పాక్‌తో క్రికెట్ అనేది […]

సైన్యం ప్రాణాలా? పాక్‌తో క్రికెట్టా?: హర్భజన్ ఫైర్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:59 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఆడటంపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. కొందరు ఆడి పాక్‌ను మట్టికరిపించాలని అంటుంటే కొందరు మాత్రం ససేమిరా వద్దంటున్నారు. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ స్పందిస్తూ పాకిస్థాన్‌పై ఫైరయ్యారు. దేశం కంటే ప్రపంచ కప్ ఏమీ పెద్దది కాదని అన్నాడు. ఒక పక్క మన సైనికుల ప్రాణాలు పోతుంటే అందుకు కారణమైన పాక్‌తో క్రికెట్ అవసరమా అని ప్రశ్నించాడు.

దేశం ముందు పాక్‌తో క్రికెట్ అనేది చాలా చిన్న విషయమని అన్నాడు. మన జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నా పాక్‌తో క్రికెట్ ఆడటం సరికాదని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌ ఆడకపోతే కంగారుపడాల్సిందేమీ లేదని, ఈ సమయంలో అంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని భజ్జీ అన్నాడు. ఇదిలా ఉంటే భజ్జీ వ్యాఖ్యలకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మద్దతు తెలిపాడు. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదని వెల్లడించాడు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికులు కన్నుమూసిన సంగతి తెలిసిందే.