భారత్ సూపర్ విక్టరీ!

లండన్: ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని.. భారత్ 3 వికెట్లు కోల్పోయి 43.3 ఓవర్లలోనే ముగించింది. ఈ క్రమంలో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లలో ఏంజెలో మాథ్యూస్ […]

భారత్ సూపర్ విక్టరీ!
Follow us

|

Updated on: Jul 07, 2019 | 2:21 AM

లండన్: ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని.. భారత్ 3 వికెట్లు కోల్పోయి 43.3 ఓవర్లలోనే ముగించింది. ఈ క్రమంలో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లలో ఏంజెలో మాథ్యూస్ (113; 128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు), లాహిరు తిరిమన్నె (53; 68 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, హార్దిక్, జడేజా, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్, రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. ఆ తరువాత భారత్ 3 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. లోకేష్ రాహుల్ ( 111; 118 బంతుల్లో11 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ (103; 94 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సెంచరీలతో కదంతొక్కారు. అటు లంక బౌలర్లలో లసిత్ మలింగ, రజిత, ఉదానాలు తలో వికెట్ తీశారు.