Breaking News
  • కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశ ప్రజలంతా రేపు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. సెలబ్రిటిలు కూడా ప్రధాని పిలుపుకు స్పందిస్తున్నారు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

ధోని..తర్వాత నువ్వే ఫీల్ అవుతావ్- లక్ష్మణ్

ICC World Cup 2019, ధోని..తర్వాత నువ్వే ఫీల్ అవుతావ్- లక్ష్మణ్

మాంచెస్టర్‌: వరల్డ్ కప్‌లో ధోనీ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో చివరివరకు ఆడి నాటౌట్‌గా నిలిచిన  ధోనీ(56నాటౌట్‌; 61బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించినా కూడా అభిమానులు సంతృప్తి చెందలేదు. ఫ్యాన్స్ మాత్రమే కాదు..మాజీ ప్లేయర్లు సైతం ఎమ్మెస్డీ ఆటతీరుపై పెదవి విరుస్తున్నారు.

ధోని ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 29 ఓవర్‌లో కేదార్‌ జాదవ్‌(7) ఔట్‌ కావడంతో క్రీజులోకి వచ్చిన ధోనీ నిదానంగా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. భారీ షాట్స్ ఆడని ధోని కేవలం సింగిల్స్‌తో స్ట్రైయిక్ రొటేట్ చేశాడు.

దీనిపై లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ధోనీ ఎప్పటిలాగే ఫినిషింగ్‌లో తన మార్క్ షాట్స్‌తో ఆకట్టుకున్నాడు. అది జట్టుకు బాగా కలిసొచ్చే అంశమే. అయితే స్టార్టింగ్‌లో కూడా అదే రేంజ్ ఆటతీరు కనపరిస్తే బాగుండేది. కానీ అందుకు విరుద్ధంగా నిదానంగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ అతను ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. స్ట్రైక్‌ రేట్‌ కూడా 50కి మించకపోవడం అసంతృప్తికి గురి చేసింది’ అని పేర్కొన్నాడు.

‘ఏదో ఒక రోజు ఈ విషయంలో ధోనీకి కూడా అలాంటి భావనే కలగవచ్చు . ఇన్నింగ్‌ నిదానంగా ఆరంభిస్తున్నట్లు తాను కూడా బాధపడతాడు. అంతకుముందు అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ అతను ఇబ్బంది పడ్డాడు. మరోవైపు హార్దిక్‌ పాండ్యలా ఆరంభం నుంచే పాజిటీవ్ థింకింగ్‌తో మహి ఆడలేకపోయాడు’ అని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు భారత అభిమానులు కూడా ధోని ఆటతీరుపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Related Tags