World Corona cases: ప్రపంచ కరోనా కేసుల వివరాలు.. పది కోట్లను దాటిన కొవిడ్ కేసులు.. మొత్తం మరణాలు ఎన్నంటే ?

యావత్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన మాత్రం తగ్గడం లేదు. అటు వ్యాక్సిన్ వచ్చినా.. కొవీడ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

World Corona cases: ప్రపంచ కరోనా కేసుల వివరాలు.. పది కోట్లను దాటిన కొవిడ్ కేసులు.. మొత్తం మరణాలు ఎన్నంటే ?
Follow us

|

Updated on: Jan 27, 2021 | 11:00 AM

యావత్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన మాత్రం తగ్గడం లేదు. అటు వ్యాక్సిన్ వచ్చినా.. కొవీడ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు సంఖ్య పదికోట్లను దాటింది. ఇక గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 5,28,698కు చేరింది. అటు నిన్న ఒక్క రోజు 15, 879 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 2,167,096 మంది కరోనాతో మరణించగా.. 72,842,827 మంది కోలుకున్నారు.

ఇక అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే అక్కడ సెకండ్ వేవ్ కొనసాగుతుండగా.. రోజూ రోజుకీ కరోనా కేసుల సంఖ్య తారాస్థాయికి చేరుతుంది. ప్రస్తుతం అమెరికా వ్యా్ప్తంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 26,011,222కు చేరగా.. 4,35,452 మంది మరణించారు. ఇక భారత్‏లో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 10,690,279కు చేరగా.. 1,53,751 మంది కరోనాతో మృతి చెందారు. ఇక ఇతర బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ దేశాలలో కూడా కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది.

Also Read: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 6,18,399 కేసులు, 10,178 మరణాలు..