ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇకపై భారత్‌లోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం..!

ఇది క్రికెట్ ఫ్యాన్స్‌కు నిజంగానే అదిరిపోయే న్యూస్.. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం భారత్‌లో నిర్మితమవుతోంది. భారత్‌లోని అహ్మదాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ స్టేడియం వచ్చే ఏడాది మార్చి కల్లా అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించేందుకు అందుబాటులోకి రానుంది. సుమారు 700 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ స్టేడియం కెపాసిటీ ఒక లక్షా 10 వేలు.. అంటే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కన్నా పదివేల సీట్లు అధికం. ఇక దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే […]

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇకపై భారత్‌లోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం..!
Follow us

|

Updated on: Dec 15, 2019 | 1:56 PM

ఇది క్రికెట్ ఫ్యాన్స్‌కు నిజంగానే అదిరిపోయే న్యూస్.. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం భారత్‌లో నిర్మితమవుతోంది. భారత్‌లోని అహ్మదాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ స్టేడియం వచ్చే ఏడాది మార్చి కల్లా అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించేందుకు అందుబాటులోకి రానుంది. సుమారు 700 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ స్టేడియం కెపాసిటీ ఒక లక్షా 10 వేలు.. అంటే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కన్నా పదివేల సీట్లు అధికం. ఇక దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కానుండటం విశేషం.

70 కార్పొరెట్ బాక్స్‌లు, నాలుగు డ్రెస్సింగ్ రూమ్స్ కలిగి ఉన్న ఈ స్టేడియంలో ఒలింపిక్స్ నిర్వహించదగిన అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉండటం గమనార్హం. గతంలో అదే ప్లేస్‌లో ఉన్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంను తొలగించి.. ఈ కొత్త స్టేడియం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ఈ అధునాతన స్టేడియం రూపుదిద్దుకోవడానికి మూడేళ్లు పట్టిందని చెప్పాలి. కాగా, వచ్చే ఏడాది మార్చిలో ఆసియా ఎలెవన్‌-వరల్డ్‌ ఎలెవన్‌ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.