మూవీలకు, ఎకానమీకి లంకె ! ఇదెక్కడి వింత ?

దేశ ఆర్ధిక పరిస్థితికి, బాలీవుడ్ చిత్రాలకు లంకె పెట్టిన వైనం ఎక్కడైనా ఉందా ? అసలు ఎన్నడూ లేని సరికొత్త వివాదానికి తెర తీసింది మోడీ ప్రభుత్వం . ఏ మాత్రం పొంతనలేని ఈ అంశాల్లో రెండో సారి అధికారంలోకి వఛ్చిన మోడీ సర్కార్ లోని అత్యంత సీనియర్ మంత్రి ఒకరు ఈ తేనెతుట్టను రేపారు. సినిమాల వసూళ్లను, దేశ ఆర్ధిక పరిస్థితిని ఆయన ఒకే గాటన కట్టారు. ఈ నెల 2 న రిలీజైన మూడు […]

మూవీలకు,  ఎకానమీకి లంకె ! ఇదెక్కడి వింత ?
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 3:38 PM

దేశ ఆర్ధిక పరిస్థితికి, బాలీవుడ్ చిత్రాలకు లంకె పెట్టిన వైనం ఎక్కడైనా ఉందా ? అసలు ఎన్నడూ లేని సరికొత్త వివాదానికి తెర తీసింది మోడీ ప్రభుత్వం . ఏ మాత్రం పొంతనలేని ఈ అంశాల్లో రెండో సారి అధికారంలోకి వఛ్చిన మోడీ సర్కార్ లోని అత్యంత సీనియర్ మంత్రి ఒకరు ఈ తేనెతుట్టను రేపారు. సినిమాల వసూళ్లను, దేశ ఆర్ధిక పరిస్థితిని ఆయన ఒకే గాటన కట్టారు. ఈ నెల 2 న రిలీజైన మూడు చిత్రాలు ఒకే రోజున దాదాపు రూ. 120 కోట్ల కలెక్షన్స్ ను సాధించాయని చెప్పుకొచ్చ్చారు. అంటే మన దేశ ఎకానమీ బాగున్నట్టేగా అన్నది ఆయన చేస్తున్న వింత వాదన. అక్టోబర్ 2 జాతీయ సెలవుదినమని, ఆ రోజున విడుదలైన మూడు హిందీ చిత్రాలు నూట ఇరవై కోట్ల వసూళ్లను సాధించాయని అన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి బాగు లేకపోతే ఇలా ఇంత ‘ పెద్ద నిధుల ప్రవాహం ‘ జరిగేదా అన్నది ఆయన మనసులోని మాట.. అయితే అప్పుడే రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలకు కౌంటర్ మొదలైంది. ప్రసాద్ వంటి సీనియర్ మినిస్టర్ ఇలాంటి కామెంట్స్ చేస్తారా అని విశ్వాస్ ఉత్తగి అనే యాక్టివిస్ట్ ప్రశ్నించారు. ఎకానమీ గురించి ఆయనకేమీతెలియనట్టుంది. ఆర్ధిక పరిస్థితిని, సినిమా రంగాన్నిఎలా పోలుస్తాం అన్నారు. దేశంలో పారిశ్రామిక రంగం కుదేలయిందని, ఆటో మొబైల్, సిమెంట్, రియల్ ఎస్టేట్ రంగాలు చతికిలబడ్డాయని, పైగా బీఎస్ఎన్ఎల్, బీపీసిఎల్ వంటి సంస్థలను ప్రయివేటు రంగానికి అమ్మేస్తున్నారని విశ్వాస్ గుర్తు చేశారు.

ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా వాల్డ్ బ్యాంక్ ఓ ‘ బాంబు ‘ పేల్చింది. 2019.. 20 ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ది రేటు ఆరు శాతానికి తగ్గిందని తన లేటెస్ట్ నివేదికలో పేర్కొంది. గత ఏడాది ఇది 6.9 శాతం ఉన్నవిషయాన్ని గుర్తు చేసింది. 2018..19 లో ఇండియా ఆర్ధిక వృద్ది రేటు 6.8 శాతం ఉంది. అంతకు ముందు అంటే.. 2017… 18 లో ఈ రేటు 7.2 శాతం ఉన్న విషయం గమనార్హం.. అని ఈ రిపోర్టు పేర్కొంది. కానీ ఈ ఏడాది 6 శాతానికి దిగజారడం , విచారకరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్పత్తి, నిర్మాణ రంగాలు మెరుగుపడిన ఫలితంగా పారిశ్రామిక వృద్ది రేటు 6.9 శాతం ఉన్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల రేటు 2.9 కి, సర్వీసుల రంగం రేటు 7. 5 శాతం మేర తగ్గినట్టు ఒక అంచనా. ఈ పరిస్థితుల్లో అటు మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకూ.. ఈ లెక్కలకూ ఏమైనా పొంత ఉందా అన్నది ఆర్థికరంగ నిపుణుల ప్రశ్న. పైగా భారత ఆర్ధిక వృద్ది రేటు అతి దారుణంగా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఈ మధ్యే వెల్లడించారు. ఆయన ఎస్టిమేషన్ ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలం నాటికి ఇది ఆరేళ్ళ కనిష్టానికి …. 5 శాతం మేర తగ్గిపోయింది. ఇన్వెస్టి మెంట్, ఎక్స్ పోర్ట్, తదితర రంగాలు మరీ దిగజారిపోయాయన్నారు అటు.. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం దేశంలో ప్రయివేటు పెట్టుబడులకు అనుకూల పరిస్థితి ఉందని, రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడులు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నామని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ వంటి విపక్షాలు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నాయి.