ప్రణయ్​ సంచలనం..ఒలింపిక్స్ విన్నర్‌పై అద్బుత విజయం

భారత షట్లర్ హెచ్​ఎస్​ ప్రణయ్ ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో అద్భుత ప్రదర్శన చేశాడు. స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ లిన్​ డాన్​ను ఓడించి ప్రీ క్వార్టర్స్​కు దూసుకెళ్లాడు. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లిన్​పై చెమటోడ్చి గెలిచాడు ప్రణయ్​. గంటా రెండు నిమిషాలు పాటు జరిగిన ఈ పోరులో 21-11, 13-21, 21-7 తేడాతో విజయం సాధించాడు. ఇరువురు ఐదు సార్లు  తలపడగా.. ప్రణయ్ 3 సార్లు గెలిచాడు. లిన్ […]

ప్రణయ్​ సంచలనం..ఒలింపిక్స్ విన్నర్‌పై అద్బుత విజయం
HS Pranoy Super Victory
Follow us

|

Updated on: Aug 21, 2019 | 5:57 AM

భారత షట్లర్ హెచ్​ఎస్​ ప్రణయ్ ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో అద్భుత ప్రదర్శన చేశాడు. స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ లిన్​ డాన్​ను ఓడించి ప్రీ క్వార్టర్స్​కు దూసుకెళ్లాడు. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లిన్​పై చెమటోడ్చి గెలిచాడు ప్రణయ్​. గంటా రెండు నిమిషాలు పాటు జరిగిన ఈ పోరులో 21-11, 13-21, 21-7 తేడాతో విజయం సాధించాడు. ఇరువురు ఐదు సార్లు  తలపడగా.. ప్రణయ్ 3 సార్లు గెలిచాడు. లిన్ రెండు సార్లు నెగ్గాడు.

మహిళల డబుల్స్​ తొలి రౌండ్​లో అశ్విని పొన్నప్ప- ఎన్​ సిక్కీ రెడ్డి జోడి చైనీస్ తైపి చాంగ్ చింగ్- యాంగ్ చింగ్ ద్వయంపై నెగ్గారు. రెండో రౌండ్​లో చైనాకు చెందిన డూ యూ – లీ హూయ్​తో తలపడనుందీ భారత జోడి.