చైనా చర్యల నేపథ్యంలో అంతా సహకరించుకుందాం, అమెరికా

లడాఖ్ (హిమాలయాల) నుంచి సౌత్ చైనా సీ వరకు చైనా ఆక్రమణ ధోరణి పెరుగుతోందని, అందువల్ల ఈ తరుణంలో ఇండియా వంటి భావసారూప్య దేశాలతో కలిసి పని చేయడం చాలా ముఖ్యమని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా..ఈ నాలుగు దేశాలూ ‘క్వాడ్’ పేరిట ఓ గ్రూపుగా ఏర్పడ్డాయని, ఇవి ఒకదానికొకటి సహకరించుకోవడం ఎంతైనా అవసరమని యూఎస్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలు కూడా ఈ […]

చైనా చర్యల నేపథ్యంలో అంతా సహకరించుకుందాం, అమెరికా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 24, 2020 | 7:25 PM

లడాఖ్ (హిమాలయాల) నుంచి సౌత్ చైనా సీ వరకు చైనా ఆక్రమణ ధోరణి పెరుగుతోందని, అందువల్ల ఈ తరుణంలో ఇండియా వంటి భావసారూప్య దేశాలతో కలిసి పని చేయడం చాలా ముఖ్యమని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా..ఈ నాలుగు దేశాలూ ‘క్వాడ్’ పేరిట ఓ గ్రూపుగా ఏర్పడ్డాయని, ఇవి ఒకదానికొకటి సహకరించుకోవడం ఎంతైనా అవసరమని యూఎస్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలు కూడా ఈ గ్రూపుతో చేతులు కలపవచ్చు అని ఆయన అన్నారు. భారత, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు ఈ నెల 6 న జపాన్ లో సమావేశమైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పైగా అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రి కూడా త్వరలో ఇండియాను సందర్శించనున్నారని, భారత అధికారులతో వారు జరిపే చర్చల్లో చైనా అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన చెప్పారు.