వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కీలక సూచనలు

కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికి పలు సూచనలతో పాటు టిప్స్ కూడా ఇచ్చింది. ఇంటి నుంచి పని చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంబంధంలేని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌లను, వీడియోలను ఓపెన్ చేయకూడదని..

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కీలక సూచనలు
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2020 | 5:20 PM

కరోనా పుణ్యమా అని ఏమీ జరగవనుకున్నవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. కరోనాతో.. అన్ని ప్రభుత్వాలూ లాక్‌డౌన్ విధించాయి. దీంతో బయటకెళ్లలేని పరిస్థితి. కరోనా ఎఫెక్ట్‌కి పలు సాఫ్ట్‌‌వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలు సైతం ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్ హోమ్‌‌ ఇచ్చాయి. అయితే ఇప్పుడు దీన్నే అదునుగా భావించిన హ్యకర్లు.. తమ మెదడుకు పని చెబుతున్నారు. ఉద్యోగుల ఆర్థిక డేటాని దోచుకునేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికి పలు సూచనలతో పాటు టిప్స్ కూడా ఇచ్చింది. ఇంటి నుంచి పని చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంబంధంలేని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌లను, వీడియోలను ఓపెన్ చేయకూడదు. అలాగే సంస్థాగత డేటా భద్రత చూసుకోవడం చాలా ముఖ్యమని.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా కొన్ని సూచనలు చేసింది.

1. పాత పాస్‌వర్డ్స్‌ని తీసేసి.. ఇంకా స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్స్‌ పెట్టాలి 2. వీలైనంత వరకూ కంపెనీ ఇచ్చిన కంప్యూటర్స్, సిస్టమ్‌లనే వాడాలి 3. అన్నింటికీ ఒకే కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌లను వాడరాదు 4. సమావేశ లింక్స్‌ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌పై షేర్ చేయకూడదు 5. నమ్మదగిన యాప్స్‌ని మాత్రమే వాడాలి. 6. యజమాని ఆమోదించిన వీడియోలను మాత్రమే కాన్ఫరెన్సింగ్‌లో ఉపయోగించాలి 7. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని వైరస్ నిరోధక, అప్‌డేట్ చేసిన యాప్స్‌తో నిర్వహించాలి 8. అవసరమైతే తప్ప రిమోట్ ఆసెస్స్‌ని ఆఫ్ చేయాలి. అవసరమైన పక్షంలో సరైన భద్రతో వినియోగించాలి 9. ఆఫీస్ సెక్యూర్ నెట్ వర్క్‌ని మాత్రమే వినియోగించాలి 10. ఈమెయిల్స్‌ని పంపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. చాలా వరకూ మీ సుపీరియర్ మెయిల్ పోలివుండే ఈమెయిల్స్ ఉంటాయి తస్మాత్ జాగ్రత్త 11. ఫ్రీ వైఫై నెట్ వర్క్‌లని నివారించాలి. హోమ్ వైఫ్, అడ్మిన్ పాస్‌వర్డ్‌లకు సంబంధించి డీ ఫాల్ట్ పాస్ వర్డ్‌లను మార్చాలి 12. యజమాని జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి

Learn More:

ఆంధ్రా సరిహద్దులో వైసీపీ ఎమ్మెల్యే హల్‌చల్.. పోలీసులపై దౌర్జన్యం

లాక్‌డౌన్‌లో అదే పని.. పోర్న్ చూడటంలో భారత్ ఫస్ట్ ప్లేస్

బ్రేకింగ్: వికారాబాద్‌లో వారం రోజుల పాటు సకలం బంద్.. కలెక్టర్‌ సంచలన నిర్ణయం

కరోనా కట్టడి: జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు వీళ్లే