బెంగళూరు మెట్రో సిబ్బంది 28 మందికి కరోనా

కరోనా మహమ్మారి కట్టడికి బ్రేకులు పడటంలేదు. కాస్త తగ్గుతుందనుకున్న వైరస్ మెల్లమెల్లగా విస్తరిస్తూనే ఉంది. తాజాగా మెట్రో సర్వీసు సిబ్బందిని తాకింది.

బెంగళూరు మెట్రో సిబ్బంది 28 మందికి కరోనా
Follow us

|

Updated on: Oct 01, 2020 | 7:55 AM

కరోనా మహమ్మారి కట్టడికి బ్రేకులు పడటంలేదు. కాస్త తగ్గుతుందనుకున్న వైరస్ మెల్లమెల్లగా విస్తరిస్తూనే ఉంది. తాజాగా మెట్రో సర్వీసు సిబ్బందిని తాకింది. ఆన్ లాక్ ప్రారంభం అనంతరం సెప్టెంబరు 7 నుంచి బెంగళూరు మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ 28 మంది మెట్రో సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. కరోనా బారిన పడినవారంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

కాగా, కరోనా నియంత్రణలో భాగంగా మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో సేవలు మొదలయ్యాయి. కాగా, బెంగుళూరు మెట్రో సిబ్బంది రోజు వారి పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టులు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ గా నిర్ధరాణ అయ్యింది. మరోవైపు, అక్టోబర్ 4 నుంచి కోల్‌కతా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కోల్‌కతా మెట్రో అధికారి ఒకరు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి తొలుత నావోపాడా కవి సుభాష్ స్టేషన్‌ల మధ్య మెట్రోసేవలు ప్రారంభమవుతాయిని తెలిపారు. మరోవైపు కరోనా నియంత్రణకు అన్ని నిబంధనలను పాటిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.