చరణ్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్ ..

కరోనా ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండటంతో అంద‌రూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ స‌మయంలో అంద‌రూ ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా బీజీ షెడ్యూల్స్ తో క్ష‌ణం తీరిక దొర‌క‌ని సినిమావాళ్లకు భారీ స్పేస్ ల‌భించిన‌ట్ల‌య్యింది. అయితే వారిలో కూడా కొంద‌రు తమ అవసరాన్ని బట్టి కొంత మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. స్క్రిప్ట్స్ వ‌ర్స్ తో పాటు..ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. వీరిలో జ‌క్క‌న్న‌… ఆర్.ఆర్.ఆర్ సినిమా […]

చరణ్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్ ..
Follow us

|

Updated on: Mar 28, 2020 | 11:10 PM

కరోనా ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండటంతో అంద‌రూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ స‌మయంలో అంద‌రూ ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా బీజీ షెడ్యూల్స్ తో క్ష‌ణం తీరిక దొర‌క‌ని సినిమావాళ్లకు భారీ స్పేస్ ల‌భించిన‌ట్ల‌య్యింది. అయితే వారిలో కూడా కొంద‌రు తమ అవసరాన్ని బట్టి కొంత మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. స్క్రిప్ట్స్ వ‌ర్స్ తో పాటు..ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. వీరిలో జ‌క్క‌న్న‌… ఆర్.ఆర్.ఆర్ సినిమా టీమ్ కూడా ఉంది.

ఎన్టీఆర్ ఇస్తానని చెప్పిన రామ్ చరణ్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ వీడియో కోసం..జ‌క్క‌న్న, తార‌క్, కీర‌వాణి స‌హా చాలామంది టీమ్ మెంబ‌ర్స్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఈ ప్రాసెస్ వ‌ల్ల వీడియో విడుద‌ల కూడా కాస్త ఆల‌స్య‌మైంది. కాగా ఆర్.ఆర్.ఆర్ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెర‌కెక్కుతుంది. కాగా త‌మిళ వెర్ష‌న్ వీడియో కోసం రాజమౌళి, కీరవాణి, మధన్ కార్కి కలిసి వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ తమిళ డైలాగ్ డెలివరీ గురించి డిస్క‌స్ చేశారు. ఈ విష‌యాన్ని మ‌ధన్ కార్కి ట్వీట్ చేశారు.

‘‘ఈ మూవీ కోసం డైరెక్ట‌ర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీరవాణితో కలిసి ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాను. రీమోట్ ద్వారా వాయిస్ రికార్డింగ్‌ను ఎన‌లైజ్ చేశాం. తారక్ సంభాష‌ణ‌లు అద్భుతంగా చెప్పారు. సినిమాలో ఆయన వాయిస్‌ను వినడానికి రెడీగా ఉండండి’’ అని తమిళ ప్రేక్షకులను ఉద్దేశించి మధన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.