ఆపిల్ కీలక ప్రకటన… ఉద్యోగుల పని స్థలాలపై వెసులుబాటు… వర్క్ ఫ్రమ్ హోమ్ జూన్ వరకు…

ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ కీలక ప్రకటన చేసింది. సంస్థలో పని చేసే ఉద్యోగల పని స్థలాలపై వెసులుబాటును కల్పించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.

ఆపిల్ కీలక ప్రకటన... ఉద్యోగుల పని స్థలాలపై వెసులుబాటు... వర్క్ ఫ్రమ్ హోమ్ జూన్ వరకు...
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2020 | 1:17 PM

ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ కీలక ప్రకటన చేసింది. సంస్థలో పని చేసే ఉద్యోగల పని స్థలాలపై వెసులుబాటును కల్పించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.

కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పనులు చేస్తున్నారు. చాలా కంపెనీలు ఉద్యోగులకు ఆ వెసులుబాటును కల్పించాయి. కరోనా నియంత్రణకు కృషి చేశాయి. అయితే, తాజాగా కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కంపెనీలు ఓత్తిడి చేస్తున్న క్రమంలో టెక్ దిగ్గజం ఆపిల్ కీలక ప్రకటనను చేసింది. తమ కంపెనీ ఉద్యోగులు వచ్చే ఏడాది జూన్ వరకు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఫలితాలను బట్టి ఆ విధానాన్ని కొనసాగించే విషయాన్ని ఆలోచిస్తామని కుక్ ప్రకటించారు.