కొత్త కష్టాలు తెచ్చిపెట్టిన వర్క్ ఫ్రం హోం.. అవసరమైతే సర్జరీలు చేయించుకుంటున్నారట..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం అధికమైంది. మాయదారి రోగానికి జనం సతమతవుతున్నారనుకుంటే.. తాజాగా ఓ రుగ్మత వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగుల్ని పట్టిపీడిస్తోంది.

కొత్త కష్టాలు తెచ్చిపెట్టిన వర్క్ ఫ్రం హోం.. అవసరమైతే సర్జరీలు చేయించుకుంటున్నారట..!
Follow us

|

Updated on: Nov 17, 2020 | 5:31 PM

చైనాలో పుట్టిందని చెబుతున్న కరోనా ప్రపంచమంతా చాలా త్వరగా పాకేసింది. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా సోకుతుందోనన్న భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. శీతాకాలంలో రెండో దఫా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కరోనా భయం అధికమైంది. మాయదారి రోగానికి జనం సతమతవుతున్నారనుకుంటే.. తాజాగా ఓ రుగ్మత వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగుల్ని పట్టిపీడిస్తోంది. దీంతో ఏకంగా శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారట.

కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా విధి నిర్వహణలో చాలా మార్పులు వచ్చాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగుల్ని వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇంటికే పరిమితమై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు, క్లయింట్లతో యాప్‌ల ద్వారా వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. అయితే, ఈ వీడియో సమావేశాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ‘జూమ్‌ డిస్మోర్ఫియా’ పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్తగా ప్రబలుతున్న ‘జూమ్‌ డిస్మోర్ఫియా’ వల్ల ఉద్యోగులు ఏకాగ్రత్త కోల్పోతున్నారని ఓ ఆధ్యయనంలో తేలింది. తమ శరీరం, ముఖంలో లోపాలు ఉంటే వాటి వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి.. మానసికంగా ఇబ్బంది పడుతారు. ఈ వ్యాధి బారిన పడుతున్నవారిని ‘డిస్మోర్ఫియా’ అంటారని వైద్య నిపుణులు. ఇటీవల ఉద్యోగులు వీడియో సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడు తమ ముఖంలో లోపాలు చూసుకొని మానసికంగా కృంగిపోతున్నారట. ఈ లోపాలను సరిదిద్దుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులపై అమెరికాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

ఇది వరకు ఉద్యోగులంతా ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో తమ రూపు గురించి మరీ పెద్దగా ఆలోచించేవారు కాదట.. కానీ, ఇప్పుడు వీడియో సమావేశాల్లో ఉద్యోగులు తమ ముఖాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుండటంతో ముఖంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయట. దీంతో వారిలో ‘డిస్మోర్ఫియా’ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. అందుకే అందంగా కనిపించడం కోసం చాలా మంది ఉద్యోగులు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ముక్కు సరి చేయించుకోవడం, ముడతలు తొలగించుకోవడం వంటివి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారట. ఈ మధ్య కాలంలో గూగుల్‌సెర్చ్‌లో ఎక్కువగా ‘అక్నే’, ‘హెయిర్‌లాస్‌’ వంటి అందానికి సంబంధించిన పదాలను ఎక్కువగా సెర్చ్‌ చేయడమే ‘జూమ్‌ డిస్మోర్ఫియా’ పెరుగుతోందనడానికి ఉదాహరణగా నిలుస్తోందంటున్నారు నిపుణులు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..