భారత్‌‌తో అణుయుద్ధం.. ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కీలక వ్యాఖ్యలను చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా తమ దేశం మొదటిగా అణ్వాయుధాల్ని ఉపయోగించదని అన్నారు. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నవే. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువైతే.. ప్రపంచం ప్రమాదంలో పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. లాహోర్‌లోని సిక్కులకు సంబంధించిన […]

భారత్‌‌తో అణుయుద్ధం.. ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Follow us

|

Updated on: Sep 02, 2019 | 11:48 PM

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కీలక వ్యాఖ్యలను చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా తమ దేశం మొదటిగా అణ్వాయుధాల్ని ఉపయోగించదని అన్నారు.

ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నవే. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువైతే.. ప్రపంచం ప్రమాదంలో పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. లాహోర్‌లోని సిక్కులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎప్పటికీ కూడా తాము మొదట యుద్ధం చేయబోమని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా భారత్ అణ్వాయుధాల ప్రయోగంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ వచ్చింది. ఎవరైనా  మన మీద అణుబాంబు  ప్రయోగించిన పక్షంలోనే భారత్ తిరిగి అణుబాంబు ప్రయోగించాలన్నది ఇప్పటివరకూ ఉన్న స్వీయ నియంత్రణ విధానం. ఇపుడు పాక్ లాంటి మొండి దేశం రంకెలు వేస్తూంటే భారత్ కూడా తన అణు విధానాలను తప్పకుండా మార్చుకుంటుందని గతంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ చెప్పారు. భారత్  మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన అణు విధానాలను మార్చుకుంటోందని ఆయన అన్నారు. ఉద్రిక్తిత పరిస్థితులు నెలకొన్నప్పుడు అవసరమైతే భారత్ మొదటగా అణు బాంబును ప్రయోగించడానికి కూడా వెనకాడబోదన్న పరోక్ష హెచ్చరికను మంత్రి గతంలోనే వినిపించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. ‘ఆయన చేసిన వ్యాఖ్యలను చదివేంత సమయం తమ దగ్గర లేదని’ ఘాటుగా రిప్లై ఇచ్చారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక చర్చలను తిరిగి ప్రారంభించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

గత నెలలో ఫ్రాన్స్‌లో జరిగిన జి -7 సమావేశంలో కూడా ప్రధాని మోదీ కశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అని చెప్పుకొచ్చారు. “భారత్, పాకిస్తాన్ల మధ్య అనేక ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయని… ఇక ఆ సమస్యలను ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకుంటామని అన్నారు. అంతేకాకుండా తమ మధ్య ఏ మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని ప్రధాని మోదీ తెలిపారు.

ఇక జమ్మూకాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్‌తో తాము అణుయుద్ధానికి సిద్ధమేనని గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి చెందిన కొందరు మంత్రులు కూడా పూటకో మాట మారుస్తూ పరిస్థితులను మరింత రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమన్హారం.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!