‘ఈయూ డే స్పేస్’: అంత‌రిక్షంలో వ‌చ్చే వాస‌నతో పెర్ఫ్యూమ్ రెడీ!

స్పేస్ నుంచి వ‌చ్చే వాస‌న ఎప్పుడైనా పీల్చారా? భూమి మీద ఉండే మ‌ట్టి వాస‌న, పూల వాస‌న,వంట‌ వాస‌న ఇలా ఎన్నో ర‌కాల సువాస‌నల‌ను ఆస్వాదించే ఉంటారు. అంతరిక్ష వాస‌న‌ను వ్యోమ‌గాములు మాత్ర‌మే పీల్చి ఉంటారు

‘ఈయూ డే స్పేస్’: అంత‌రిక్షంలో వ‌చ్చే వాస‌నతో పెర్ఫ్యూమ్ రెడీ!
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 1:01 PM

స్పేస్ నుంచి వ‌చ్చే వాస‌న ఎప్పుడైనా పీల్చారా? భూమి మీద ఉండే మ‌ట్టి వాస‌న, పూల వాస‌న,వంట‌ వాస‌న ఇలా ఎన్నో ర‌కాల సువాస‌నల‌ను ఆస్వాదించే ఉంటారు. అంతరిక్ష వాస‌న‌ను వ్యోమ‌గాములు మాత్ర‌మే పీల్చి ఉంటారు. ఇప్పుడు అంద‌రూ ఈ వాన‌స గురించి తెలుసుకోవ‌డానికి నాసా స‌రికొత్త పెర్ఫ్యూమ్‌ను త‌యారు చేసింది. అంత‌రిక్షంలో నెల‌ల‌పాటు జీవించే వ్యోమగాములకు అక్కడ వింతైన వాసన వస్తుందని చెబుతుంటారు. ఈ క్రమంలో ఒమెగా ఇంగ్రెడియంట్స్ కంపెనీ అధినేత, రసాయన శాస్త్రవేత్త స్టీవ్ పియర్స్‌కు సరికొత్త ఆలోచన వచ్చింది.

ఏంటంటే.. స్పేస్ నుంచి వ‌చ్చే వాసనతో పెర్ఫ్యూమ్ తయారు చేస్తే ఎలా ఉంటుందని భావించారు. ఈ విషయాన్ని నాసా అధికారులకు చెప్పారు. ‘‘అంతరిక్షంలో పొగలు కమ్ముకున్నట్లు, ఏదో కాలుతున్నట్లుగా వాసన వస్తుంది. అది ఎంతో వెగటు పుట్టిస్తుంది. నోటిలో చేదు అనిపిస్తుంది’’ అని అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సాన్ వివరించారు. నాసా వ్యోమగాములు చెప్పిన వివరాలతో పియర్స్ ఆ పెర్ఫ్యూమ్‌ను తయారు చేశారు. దీనికి ‘ఈయూ డే స్పేస్’ (Eau De Space) అని పేరు పెట్టారు. ఈ వాస‌న పీల్చాలంటే కొన్నిరోజులు వేచిచూడాల్సిందే!