ఎవర్‌గ్రీన్ యంగ్‌లుక్ కోసం…

Wonder how Japanese women look young and fit? 5 diet secrets for weight loss beautiful skin and hair, ఎవర్‌గ్రీన్ యంగ్‌లుక్ కోసం…

ప్రపంచ దేశాల్లో జపాన్ ప్రజలు ప్రత్యేకంగా కనిపిస్తారు. ముఖ్యంగా జపాన్ మహిళలు చక్కటి ఫిట్‌నెస్, బ్యూటీఫుల్ స్కిన్, మెరిసే హెయిర్… ఇలా అన్ని రకాలుగా అందంగా కనిపిస్తారు. ముఖ్య కారణం వారి ఆహారపు అలవాట్లు. వివరాల్లోకెళితే…

  • జపాన్ ప్రజలు చిన్నప్పటి నుంచే మంచి ఆహారం తీసుకుంటున్నారు. వాళ్ల డైట్ విధానం అనుసరిస్తే, ఎవరైనా సరే… ఎక్కువ కాలం యంగ్ లుక్‌తో కనిపించవచ్చు. ఎన్నో పరిశోధనల్లో ఇది నిజమని తేలింది. ప్రధానంగా వాళ్లు కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నారు. బరువు తగ్గాలనుకునేవాళ్లు, మంచి ఆహారం తినాలి అనుకునేవాళ్లు జపాన్ ప్రజల ఆహార అలవాట్లను తెలుసుకుని ఫాలో అయితే ఎంతో ప్రయోజనం కలుగుతోంది.
  • జపాన్ ప్రజల డైట్‌లో ఎక్కువగా గింజలు, ధాన్యాలు, కాయగూరలు, సముద్ర చేపలు, పాలు, పండ్లు ఉంటున్నాయి. హెర్బల్ టీ కూడా ఆరోగ్యాన్ని పెంచుతోంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించేవే.
  • జపాన్ ప్రజలు ఎక్కువగా కూరగాయలు తింటున్నారు. వాటిలో పోషకాలు చాలా ఎక్కువ. పైగా మన బాడీ నుంచీ విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ అనేవి కూరగాయలు, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి. బ్రకోలీ, కాలీఫ్లవర్, కాలే, మొలకలు, చైనీస్ క్యాబేజీ వంటివి ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి. వాటిలోని విటమిన్ సీ, ఫైబర్ వంటివి అధిక బరువును తగ్గిస్తున్నాయి. తక్కువ మంటలో (సిమ్) ఉడికించి తినడం వల్ల… వంటల్లో పోషకాలు పోకుండా ఉంటున్నాయి.
  • జపాన్ ప్రజలు సముద్ర ఆహారం ఎక్కువగా తింటున్నారు. చేపల్ని బాగా తింటారు. చేపల్లో ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని అధిక బరువును తగ్గిస్తాయి. పొట్ట సమస్య, నడుం చుట్టూ ఉన్న కొవ్వును వదిలిస్తాయి. బ్రెయిన్ చురుకవుతుంది. గుండెకు మేలు. పైగా ముసలితనం రాకుండా కూడా చేస్తాయి. స్కిన్‌ని కాపాడతాయి. జుట్టు ఊడిపోకుండా చాలా మేలు జరుగుతుంది.
  • వీరు రెడ్ మీట్ తక్కువగా తింటున్నారు. ఇందులోని కొవ్వు… మన శరీరంలో తిష్టవేసి… బరువు పెరిగేలా చేసి… గుండె పోటు, ఇతర హార్ట్ సమస్యలు వచ్చేలా చేస్తోంది. బేకింగ్ చేసిన పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రై చేసిన ఫుడ్‌లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఎంత తక్కువ తింటే అంత మంచిదంటున్నారు అక్కడి ప్రజలు.
  • జపాన్ ప్రజలు ఇష్టపడి తాగేది గ్రీన్ టీ. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్… కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు రాకుండా చేస్తున్నాయి. బరువు తగ్గుతున్నారు. ముఖ్యంగా పొట్ట పెరగకుండా ఉండేందుకు గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *