రాష్ట్రపతి నుంచి ‘నారీ శక్తి పురస్కారాలు’ .. అవార్డు అందుకున్న ఏపీ మహిళ

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఆదివారం 12 మంది మహిళలు ' నారీ శక్తి అవార్డులు'  అందుకున్నారు. వీరిలో ఏపీ.శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి అనే మహిళ కూడా ఉన్నారు.

రాష్ట్రపతి నుంచి 'నారీ శక్తి పురస్కారాలు' .. అవార్డు అందుకున్న ఏపీ మహిళ
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 08, 2020 | 3:43 PM

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఆదివారం 12 మంది మహిళలు ‘ నారీ శక్తి అవార్డులు’  అందుకున్నారు. వీరిలో ఏపీ శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి అనే మహిళ కూడా ఉన్నారు. ఆమెతో బాటు ముంగేర్ (బీహార్) కి చెందిన బీనాదేవి, శ్రీనగర్ కు చెందిన ఆరిఫా జాన్, ఝార్ఖండ్ కు చెందిన ఛామీ ముర్ము, లేహ్ (లడఖ్) కు చెందిన నీల్జా వాగ్మో , మహారాష్ట్రవాసి రష్మీ, పంజాబ్ వాసి 103 ఏళ్ళ మాన్ కౌర్, తదితరులు ఉన్నారు. కాగా-గ్రామీణ మహిళా రైతుల అభ్యున్నతి , గిరిజన మహిళా అభివృద్ధి కోసం పడాల భూదేవి ఎంతగానో కృషి చేశారు. తన 11 ఏళ్ళ వయస్సులోనే వివాహమై భర్త, అత్తమామల నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ, తన ముగ్గురు కూతుళ్లతో అన్ని కష్టాలను ఎదుర్కొని పేద మహిళల కు రోల్ మోడల్ గా నిలిచింది ఆమె స్వయంకృషితో వారు ఎదిగేందుకు తనవంతు చేయూతను అందించింది. ఇక పంజాబ్‌కు చెందిన మాన్ కౌర్ 93 ఏళ్ళ వయస్సులో అథ్లెటిక్ చాంపియన్ కావడం విశేషం. నాలుగు ట్రాక్ అండ్ ఫీల్డ్ అవార్డులు కూడా అందుకుంది ఆమె.. పోలండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న మాన్ కౌర్‌ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.