సింగపూర్ లో ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలు..!

మహిళా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఈసారి సింగపూర్ లో ఈ వేడుక ఘనంగా జరుపుకున్నారు ప్రవాస మహిళలు. మనం తెలుగు సింగపూర్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో  చేనేత వస్త్రాలను ప్రోత్సహించేలా నేత చీరలు కట్టుకుని వచ్చిన ప్రవాస మహిళలు ఈ వేడుకను ఏపీ, తెలంగాణ లో ఉన్న నేతన్నలకు అంకితం ఇచ్చారు. అంతేకాదు ప్రతీ మహిళ తన ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలన్న సందేశంతో దాదాపు ఆరు కిలోమీటర్లు వాక్ […]

సింగపూర్ లో ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలు..!
Follow us

|

Updated on: Mar 15, 2019 | 2:55 PM

మహిళా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఈసారి సింగపూర్ లో ఈ వేడుక ఘనంగా జరుపుకున్నారు ప్రవాస మహిళలు. మనం తెలుగు సింగపూర్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో  చేనేత వస్త్రాలను ప్రోత్సహించేలా నేత చీరలు కట్టుకుని వచ్చిన ప్రవాస మహిళలు ఈ వేడుకను ఏపీ, తెలంగాణ లో ఉన్న నేతన్నలకు అంకితం ఇచ్చారు. అంతేకాదు ప్రతీ మహిళ తన ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలన్న సందేశంతో దాదాపు ఆరు కిలోమీటర్లు వాక్ చేశారు మనం తెలుగు సింగపూర్ టీం.