మాస్టర్ బ్లాస్టర్ టూ మాస్టర్ చెఫ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెందుల్కర్‌ కుక్‌ అవతారం ఎత్తాడు. ఆడవారి పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. తన తల్లి, భార్య అంజలి, కూతరు సారాల కోసం ప్రత్యేకంగా వంట తయారు చేశాడు. ఈ విధంగా తన జీవితంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళలకు శుభాకాంక్షలు చెప్పానని సచిన్‌ ట్వీట్ చేశాడు. ‘ ఈ మహిళా దినోత్సవం రోజున మన జీవితాల్లో ఉన్న అత్యంత ముఖ్యమైన మహిళల కోసం ఏదో ఒకటి ప్రత్యేకంగా చేద్దాం. […]

మాస్టర్ బ్లాస్టర్ టూ మాస్టర్ చెఫ్
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 9:17 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెందుల్కర్‌ కుక్‌ అవతారం ఎత్తాడు. ఆడవారి పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. తన తల్లి, భార్య అంజలి, కూతరు సారాల కోసం ప్రత్యేకంగా వంట తయారు చేశాడు. ఈ విధంగా తన జీవితంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళలకు శుభాకాంక్షలు చెప్పానని సచిన్‌ ట్వీట్ చేశాడు.

‘ ఈ మహిళా దినోత్సవం రోజున మన జీవితాల్లో ఉన్న అత్యంత ముఖ్యమైన మహిళల కోసం ఏదో ఒకటి ప్రత్యేకంగా చేద్దాం. ప్రేమతో వారికి ఏం చేశారో చెప్పండి’ అంటూ సచిన్ వంట చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతుంది.