GHMC Election Results 2020: బల్దియాలో విజేతను నిర్ణయించనున్న మహారాణులు.. గ్రేటర్ ఎన్నికల అభ్యర్థుల తల రాతనుమార్చనున్న మహిళలు

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నగరంలోని ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోరాడిన ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో నెలకొన్న...

GHMC Election Results 2020: బల్దియాలో విజేతను నిర్ణయించనున్న మహారాణులు.. గ్రేటర్ ఎన్నికల అభ్యర్థుల తల రాతనుమార్చనున్న మహిళలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 6:54 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నగరంలోని ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోరాడిన ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో నెలకొన్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా నాయకుల్లో ఆందోళనను మరింతగా పెంచేలా చేసింది. ఇక ఆయా పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న నేతలను సైతం ఎన్నికల ఫలితాలు టెన్షన్ పెడుతున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. పోల్ అయిన ఓట్లలో మహిళల ఓట్లకు, పురుషుల ఓట్లకు మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. గతంలోకంటే ఈసారి ఓటింగ్‌లో మహిళలు పెద్దఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో మహిళ ఓట్లు కీలక మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎక్కువ శాతం మహిళలు ఎవరికి ఓటు వేశారన్నది ఇక్కడ కీలకంగా మారనుంది. వీరి ఓట్లు గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది. వీరు ఎవరివైపు మొగ్గు చూపారు అనేది తెలియాల్సి ఉంది. కార్పోరేషన్‌లోని అన్ని వార్డుల్లో కూడా మహిళ ఓటర్లు కీలకంగా మారుతున్నారు. వారిని ఎవరు ప్రసన్నం చేసుకుంటారు అనేది తేలనుంది.

గత ఎన్నికల్లో కన్నా దాదాపు 10 నుంచి 15 శాతం ఓటింగ్ పెంచాలని భావించినప్పటికీ ఒక్క శాతం పోలింగ్ పెరిగింది. మొత్తం 74 లక్షల ఓటర్లు ఉంటే 34. 50 లక్షల మంది మాత్రమే ఓట్లు వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని వర్గాల జనాలు ఉంటారు. పేదల నుంచి సెలబ్రిటీల వరకు అన్ని స్థాయిలో సిటీలో అన్ని డివిజన్లలో ఉంటారు.

ఈ గ్రేటర్ ఎన్నికల్లో బస్తీ మహిళలు మిగిలిన వర్గాల కంటే ఓటేసిన వారిలో ముందు ఉన్నారు. సిటీ వ్యాప్తంగా 2 వేలకు పైగా బస్తీలు ఉండగా, ఇందులో 18 లక్షల మంది జనాభా ఉంటారనే అంచనా. ఇందులో ఉన్న జనాభాలో 75 శాతం కంటే ఎక్కువ బస్తీవాసులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బస్తీలు ఎక్కువగా ఉండే డివిజన్లలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇందులో ప్రధానమైన చర్లపలి, చిలుకా నగర్, రామాంతాపూర్, ఉప్పల్, హయత్ నగర్, అంబర్ పేట్, అడ్డగుట్ట, బండ్ల గూడ వంటి ప్రాంతాల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇందులోనూ 75 శాతం ఓట్లేసింది బస్తీలళ్ల ఉండేటోళ్లే. మరి వీరు ఎవరివైపు అనేది తేలాల్సి ఉంది.

అయితే నేతలెవరికీ మహిళా ఓటర్ల అంతరంగం అంతుపట్టడం లేదని తెలుస్తోంది. అయినా చాలామందికి మహిళా ఓటరు నాడి తెలియడం లేదని సమాచారం. దీంతో ఫలితాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. అభ్యర్థులు, వారి గెలుపు కోసం పని చేసిన నేతల్లో మాత్రం అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది.

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్