Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ పాస్ చేసినట్టు ప్రకటించింది.
  • కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తున్నదని అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆర్మీలో ‘ఆమె’కు అందలం.. సుప్రీంకోర్టు ఆదేశం

Women Officers can Get Posts in Army, ఆర్మీలో ‘ఆమె’కు అందలం.. సుప్రీంకోర్టు  ఆదేశం

భారత సైన్యంలో మహిళలకు కూడా సమున్నత పదవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. సైన్యంలో పురుష అధికారులతో సమానంగా కల్నల్ లేదా అంతకన్నా ఎక్కువస్థాయి పోస్టులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే సైన్యంలో వారికి శాశ్వత కమిషన్ ఉండాలన్న  ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సైన్యంలో  ఎక్కువగా గ్రామీణ మహిళలు చేరుతున్నారని, వీరి కారణంగా పురుష అధికారులు ఆత్మన్యూనతతో ఆందోళన చెందవచ్చునన్న కేంద్రం వాదనను కోర్టు కొట్టివేసింది. మీ మైండ్ సెట్ మారాలి అని చురకలు వేసింది. ఆర్మీలో మహిళలకు ఎన్ని ఏళ్ళ సర్వీసు ఉన్నా..శాశ్వత కమిషన్ వల్ల కలిగే ప్రయోజనాలు వారికి వర్తిస్తాయని స్పష్టం చేసిన కోర్టు.. మూడు నెలల్లోగా ఈ కమిషన్ ను  ఏర్పాటు చేయాలని  ఆదేశించింది. ‘పురుష సిబ్బందితో సమానంగా మహిళలకు కూడా అపాయింట్ మెంట్లు ఉండాలి.. అసలు  మీరు ‘జెండర్ వివక్ష ‘చూపుతున్నారు’ అని కూడా కోర్టు కేంద్రాన్ని తప్పు పట్టింది. కాగా-సుప్రీం తీర్పు పట్ల సైన్యంలోని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

Women Officers can Get Posts in Army, ఆర్మీలో ‘ఆమె’కు అందలం.. సుప్రీంకోర్టు  ఆదేశం

 

 

Related Tags