Breaking News
  • నిజామాబాద్‌లో హైఅలర్ట్. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్క రోజే 26 కేసులు. పాజిటివ్‌ వచ్చినవారి బంధువులను గుర్తించే పనిలో అధికారులు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 కేసులు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో 144 సెక్షన్‌. పాజిటివ్‌ ప్రాంతాల్లోని వాసులకు హోంక్వారంటైన్‌. రక్త నమూనాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.
  • గుజరాత్: సురేంద్రనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి, మరొకరికి గాయాలు. హైదరాబాద్-70, వరంగల్‌ అర్బన్-19, కరీంనగర్-17 కేసులు. మేడ్చల్-15, రంగారెడ్డి-16, నిజామాబాద్-16, నల్గొండ-9. కామారెడ్డి-8, మహబూబ్‌నగర్-7, గద్వాల-6, సంగారెడ్డి-6. మెదక్-4, భద్రాద్రి-కొత్తగూడెం-4 కేసులు. ములుగు-2, భూపాలపల్లి-1, జనగామ-1 కేసులు నమోదు.
  • రాజస్థాన్: ఈరోజు కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదు. మొత్తం 191 కేసులు నమోదు.
  • ఏపీ, తెలంగాణలో రేషన్‌ పరేషాన్. రేషన్‌ షాప్‌ల దగ్గర భారీగా క్యూ కట్టిన జనం. మెజారిటీ షాప్‌ల దగ్గర కనిపంచిన భౌతికదూరం నిబంధన. పంపిణీలో జాప్యంపై నిర్వాహకులతో జనం ఘర్షణ. రంగంలోకి దిగిన పోలీసులు. రేషన్‌ షాప్‌ల దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు. కార్డు దారులందరికీ ఉచిత బియ్యం అందిస్తామంటున్న అధికారులు.

చక్కెర మీదే మక్కువ.. మహిళలూ మీరే టాప్!

Womens eat more sugar, చక్కెర మీదే మక్కువ.. మహిళలూ మీరే టాప్!

యాడెడ్ షుగర్ వాడకంలో మహిళలదే పైచేయి అట. ఇదే విషయం తాజాగా భారత వైద్య పరిశోధన మండలి, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్  సంయుక్త అధ్యయనంలో తేలింది. యాడెడ్ షుగర్ అంటే.. ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా ఉన్న తీపి కంటే, అదనంగా చేర్చే తీపిని యాడెడ్ షుగర్‌గా పిలుస్తారు. ఇలాంటి షుగర్‌ను ఎక్కువగా మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రజలు సగటున రోజుకు 19.5 గ్రాములు తింటున్నారట. ఇదే విషయాన్ని పలు ఇన్‌స్టిట్యూట్‌లు కూడా తెలియజేశాయి.

ఈ యాడెడ్‌ షుగర్‌ను సగటున రోజుకు పురుషులు 18.7 గ్రాములు, మహిళలు 20.2 గ్రాములు తింటున్నారట. ముంబైలో వీటి వినియోగం అత్యధికంగా ఉంది. రోజుకు 26.03 గ్రాముల యాడెడ్ షుగర్‌ను లాగించేస్తున్నారు. ఇక అత్యల్పంగా హైదరాబాద్‌లో దాదాపు 15 గ్రాముల మేర వినియోగం ఉండగా.. అహ్మదాబాద్‌లో స్త్రీ, పురుషులు సమానంగా రోజుకు 25.9 గ్రాముల షుగర్‌ను ఆరగిస్తున్నారు. వయసుపరంగా చూస్తే 36-59 ఏళ్ల మధ్యవారిలో షుగర్ వినియోగం అత్యధికంగా ఉన్నట్టు భారత వైద్య పరిశోధన మండలి తెలియజేసింది.

Womens eat more sugar, చక్కెర మీదే మక్కువ.. మహిళలూ మీరే టాప్!

Related Tags