Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

డయాబెటిస్ మహిళలకు మరింత చేదు!

Women at more risk, డయాబెటిస్ మహిళలకు మరింత చేదు!

డయాబెటిస్ గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని తెలుసు, అయితే 12 మిలియన్ల మందిపై చేసిన అధ్యయనంలో పురుషుల కంటే మహిళలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు కనుగొన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 415 మిలియన్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కాగా… వారిలో సుమారు 199 మిలియన్లు మహిళలు.

ప్రపంచంలోని డయాబెటిస్ క్యాపిటల్ అని పిలువబడే భారతదేశంలో, 2017 లో 72 మిలియన్లకు పైగా డయాబెటిస్ కేసులు నమోదయ్యాయి – అంటే దేశంలోని వయోజన జనాభాలో 8.8 శాతం మందికి ఈ వ్యాధి ఉంది. టైప్ -1 డయాబెటిస్ పురుషులతో పోలిస్తే మహిళల్లో 47 శాతం అధికంగా గుండె ఆగిపోయే ప్రమాదం కలిగి ఉండగా, టైప్ -2 డయాబెటిస్ పురుషుల కంటే మహిళలకు గుండె ఆగిపోయే ప్రమాదం 9 శాతం ఎక్కువగా ఉందని జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది.

మహిళలకు గుండె సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన జార్జ్ ఇన్స్‌టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సహ రచయిత సాన్ పీటర్స్ చెప్పారు. డయాబెటిస్ ఉన్న మహిళలు అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఐడిఎఫ్ నివేదించింది. లింగ వివక్ష‌, శక్తి అసమతుల్యత, ఆహారం తీసుకోకపోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఏర్పడే సామాజిక ఆర్థిక అసమానతలు ఇవన్నీ మధుమేహాన్ని ప్రభావితం చేస్తాయి. 2040 నాటికి 313 మిలియన్ల మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతారని ఐడిఎఫ్ పేర్కొంది. ప్రతి సంవత్సరం 2.1 మిలియన్ల స్త్రీలు డయాబెటిస్ వల్ల‌ ప్రాణాలు కోల్పోతున్నారు, ఇది పురుషుల కంటే ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి.